పెద్దఅంబర్‌పేట, జూలై 06 : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారామతిపేట వద్ద అవుటర్ రింగ్ రోడ్డుపై బుధవారం ఓ డీజిల్ ట్యాంకర్ బోల్తాపడింది. వివరాల్లోకి వెళ్తే.. డీజిల్ ట్యాంకర్ చెర్లపల్లి నుంచి కోదాడకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నది. ట్యాంకర్‌లోని డీజిల్ కొంత రోడ్డు పాలైంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్యాంకర్ బోల్తాపడటంతో కొద్దిసేపు ఓఆర్ఆర్పై వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుకు అడ్డంగా బోల్తాపడిన లారీని పోలీసులు క్రేన్ సాయంతో తొలగించారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.