మొక్కవోని దీక్షతో..
హరిత తెలంగాణ కోసం రాష్ట్ర సర్కార్ అహర్నిశలు కృషి చేస్తున్నది. ఏటా ‘హరితహారం’ నిర్వహిస్తూ విరివిగా మొక్కలు నాటి సంరక్షించేలా చర్యలు తీసుకుంటున్నది. నర్సరీలు, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో ప్రతి పల్లె పచ్చదనంతో పరిఢవిల్లుతున్నది. చెట్లతోనే మానవుడి మనుగడ సాధ్యమని భావించి అడవుల శాతాన్ని పెంచాలన్న బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
- 19 మండలాల్లో 95 బృహత్ ప్రకృతి వనాలు..
- జూన్‌లోగా అన్నీ అందుబాటులోకి..
- ఇప్పటివరకు 71 బృహత్ ప్రకృతి వనాలు పూర్తి
- తుది దశకు చేరిన మరో 16 బీపీవీల ఏర్పాటు ప్రక్రియ
- వారం రోజుల్లో రెండు బీపీవీల్లో పనులు ప్రారంభించేందుకు చర్యలు
- మరో ఆరు బీపీవీల ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించేందుకు కసరత్తు
- 31 రకాలతో కూడిన 23 వేల మొక్కలతో వనం
- చిట్టడవులను సృష్టించడమే ప్రధాన ఉద్దేశం
హరిత తెలంగాణ కోసం రాష్ట్ర సర్కార్ అహర్నిశలు కృషి చేస్తున్నది. ఏటా ‘హరితహారం’ నిర్వహిస్తూ విరివిగా మొక్కలు నాటి సంరక్షించేలా చర్యలు తీసుకుంటున్నది. నర్సరీలు, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో ప్రతి పల్లె పచ్చదనంతో పరిఢవిల్లుతున్నది. చెట్లతోనే మానవుడి మనుగడ సాధ్యమని భావించి అడవుల శాతాన్ని పెంచాలన్న బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి మండలంలో నాలుగైదు బృహత్ ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఒక్కో బృహత్ ప్రకృతి వనాన్ని ఐదు నుంచి పది ఎకరాల్లో 31 రకాలతో కూడిన 20 నుంచి 30 వేల మొక్కలు నాటాలని నిర్ణయించింది. వికారాబాద్ జిల్లాలోని 19 మండలాల్లో 95 బృహత్ ప్రకృతి వనాలను ఏర్పాటు చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించగా, ఇప్పటికే 71 వనాలు అందుబాటులోకి వచ్చాయి. మరో 16 వనాల్లో పనులు తుది దశకు చేరాయి. మిగతా వాటిని జూన్‌లోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
– వికారాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అంతటా పచ్చదనం పరిఢవిల్లేలా రాష్ట్ర ప్ర భుత్వం చర్యలు చేపట్టింది. అందుకోసం ప్రతి ఏడాది తెలంగాణకు హరితహారంలో భాగంగా భారీస్థాయిలో మొక్కలను నాటిస్తున్నది. కాగా మండలానికి నాలుగైదు బృహత్ పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించిం ది. ఇప్పటికే గ్రామానికి ఒకటి చొప్పున పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయగా, ప్రస్తుతం ప్రతి మండలంలోనూ నాలుగైదు బృహత్ పల్లెప్రకృతి(బీపీపీవీ) వనాలను ఏర్పాటు చేసే ప్రక్రియ తుది దశకు చేరింది. ప్రధానంగా యాదాద్రి ఫారెస్ట్ మాడల్‌ను అనుసరిస్తూ ప్రతి మండలంలోనూ ఐదు చిట్టడవులను సృష్టించేందుకు చర్యలు చేపట్టింది. వీటిని ఐదు నుంచి పది ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి బీపీపీవీలోనూ 20-30వేల చొప్పున మొక్కలను నాటుతున్నా రు. అందులో నీడనిచ్చే మొక్కలతోపాటు పూలు, పండ్లు, ఔషధ మొక్కలను నాటుతున్నారు. అయితే జిల్లాలోని 19 మండలాల్లో 95 బృహత్ పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించగా..అందులో ఇప్పటివరకు 71 బీపీపీవీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగిలిన వాటిని జూన్‌లోగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలను ముమ్మరం చేశారు.
చిట్టడవుల్లా బృహత్ పల్లెప్రకృతి వనాలు..
బృహత్ పల్లెప్రకృతివనాన్ని 5-10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.35 నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు చేస్తున్నది. ప్రతి బీపీపీవీల్లోనూ పొడవు, పొట్టి, మధ్యస్థ ఇలా 31 రకాల మొక్కలు అన్ని కలిపి మొ త్తం 20-30 వేల వరకు నాటుతున్నారు. చింత, వేప, కానుగ, గంగారావి, నేరేడు, గోరింట, గుల్మార్, జామ, దానిమ్మ, సీతాఫలం, సీమచింత, మునగ, ఎర్రగడ్డి, మర్రి, వెదురు, రావి, రైన్ చెట్టు, విప్ప, బొప్పాయి, ఫిబ్రవరి ఫ్లవర్, బిల్వపత్రం, మేడి, గాంచుసీమ, టెకోమా, మద్ది, పనస, మారేడు తదితర మొక్కలను నాటుతున్నారు. బృహత్ పల్లెప్రకృతివనాల్లో పిల్లలు ఆడుకునేందుకు సుమారు ఎకరా స్థలంలో ఆటస్థలాన్ని ..
వాకింగ్ చేసేందుకు వాకింగ్ ట్రాక్‌తోపాటు సేద తీరేందుకు కుర్చీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 95 బృహత్ ప్రకృతివనాలను ఏర్పాటు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటివరకు 71 బీపీపీవీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మరో 16 బృహత్ వనాల ఏర్పాటు పనులు తుది దశకు చేరుకున్నా యి. మరో రెండు బీపీపీవీల పనులను వారం రో జుల్లో ప్రారంభించనున్నారు. మరో ఆరు బృహత్ పల్లెప్రకృతి వనాలకు సంబంధించి స్థలాలను గుర్తించాల్సి ఉంది. అయితే జిల్లాలో ఇప్పటివరకు ఏర్పాటు చేసిన బృహత్ పల్లెప్రకృతి వనాల్లో 8,66,368 మొక్కలను నాటారు. మిగతా బీపీవీల్లో 7,63,632 మొక్కలను నాటనున్నారు. నాటిన మొక్కలు ఏపుగా పెరిగి రానున్న రెండేండ్లలో చిట్టడవుల్లా మారనున్నాయి.
పచ్చదనం పెంపే లక్ష్యంగా..
సీఎం కేసీఆర్ ప్రభుత్వం పచ్చదనం పెంపునకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ఇందుకోసం రా ష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఇప్పటికే పల్లెప్రకృతివనాలను ఏర్పాటు చేయగా.. ప్రతి మండలానికీ ఐదు చొప్పున బృహత్ పల్లెప్రకృతివనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించి చర్యలను ముమ్మరం చేసింది. జిల్లాలో 95 బృహత్ ప్రకృతివనాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటివరకు 71 బీపీవీలను పూర్తి చేశాం. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని కూడా జూన్ నెలాఖరు వరకు అందుబాటులోకి తీసుకొస్తాం.
– కృష్ణన్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి వికారాబాద్ జిల్లా
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

