బుధవారం 08 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 19, 2020 , 00:20:16

గుబులు రేపుతున్న ‘స్వతంత్రులు’..!

గుబులు రేపుతున్న ‘స్వతంత్రులు’..!

రంగారెడ్డి జిల్లా,నమస్తే తెలంగాణ: పుర‘పోరు’ బరిలో స్వతంత్ర అభ్యర్థులు గణనీయంగా బరిలోకి దిగారు. జిల్లాలోని మూడు కార్పొరేషన్లు,12 మున్సిపాలిటీల పరిధిలో 351 వార్డులు ఉన్నాయి.వీటిలో 3 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 348 స్థానాలకు మొత్తం 1278 మంది బరిలో నిలిచారు. స్వల్పంగా ఇబ్రహీంపట్నంలో ముగ్గురు,ఆదిభట్లలో ఐదుగురు, ఆమ నగల్లులో 9 మంది స్వతంత్రులు బరిలో నిలువగా కార్పొ రేషన్లు,మున్సిపాలిటీల పరిధిలో పదుల సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా వార్డు ల్లో స్వతంత్రు లు ప్రధాన పార్టీలకు ధీటుగా తమ సత్తా చాట్టేందుకు ప్రయత్నిస్తుండటంతో ఇది ఎవరికి నష్టం చేకురుస్తుందోనని ప్రధాన పార్టీల్లో గుబులు రేపుతోంది. వీరి ప్రభావం ఏ మేరకు ఉండనుందో..ఎవరి గెలుపోటములపై ప్రభావం చేపనున్నారోనని నేతల టెన్షన్‌ పట్టుకుంది.

నగర శివారు ప్రాంతాలు కావడంతోనే ..

జిల్లాలో పట్టణ పరిధి విస్తరించడంతో ఓటర్లు భారీగా పెరిగారు. వీటికి అనుగుణంగా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం ఇక్కడ ఆది నుంచి ఉంటోంది. కౌన్సిలర్ల సంఖ్యాబలం అవసరం అనుకున్నప్పుడు ఈ స్వతంత్రుల మద్దతే కీలకంగా ఉంటుంది. నగర శివారు ప్రాంతంలో రియల్‌ భూమ్‌ అధికంగా ఉండటంతో స్థిరాస్థి వ్యాపారులు తమ అదృష్టాన్ని పరిశీలించుకుంటున్నారు. డబ్బులకు కొదువ లేకపోవడంతో అత్యధికంగా స్వతంత్రులు బరిలో నిలిచారు. జిల్లాలోని ఆమనగల్లు,నార్సింగి, ఇబ్రహీంపట్నం ,పెద్దఅంబర్‌పేట్‌,శంషాబాద్‌,శంకర్‌పల్లి, షాద్‌నగర్‌, తు క్కుగూడ,ఆదిభట్ల,తుర్కయాంజల్‌, మణికొండ,జల్‌పల్లి మున్సిపాలిటీలు ఉండగా.. మూడు కార్పొరేషన్ల పరిధిలోని బండ్లగూడ జాగీర్‌ కార్పొరేషన్‌,బడంగ్‌పేట్‌,మీర్‌పేట్‌లు ఉన్నాయి.వీటిలో రియల్‌ వ్యాపారం ప్రతి నిత్యం కొనసాగుతుంది. వారంతా పోటీలోకి దిగి కీలకంగా మారాలని భావిస్తున్నారు. పలు వార్డుల్లో లెక్కకు మించి పోటీలో ఉన్నారు. ఆయా మున్సి పాలిటీల్లో ముగ్గురు నుంచి మొదలు పెట్టి 40 మంది వరకు స్వతంత్రులు బరిలో నిలిచారంటే అర్థం చేసుకోవ చ్చు. స్వతంత్రులు ఉండడంతో ఆ వార్డుల్లో గెలుపు ఎవరనేదానిపై అం దరిలో ఆసక్తి కలుగుతోంది. అధికార పార్టీకి రెబల్‌ గుబులురేపకపోయిన బీజేపీ,కాంగ్రెస్‌, ఎంఐఎం,సీపీఐ, సీపీ ఎం,టీడీపీ అభ్యర్థులున్న చోట వీరు వారికి దీటుగా కదనరంగంలో ఉండండతో గల్లీ రాజకీ యాలు ఉత్కంఠకు దారితీస్తున్నాయి.

పార్టీలకు తిరుగుబాటు బెడద

తిరుగుబాట బెడద అన్ని పార్టీలకు ప్రధాన సమస్యగా తయారైంది.టీఆర్‌ఎస్‌,బీజేపీ,కాంగ్రెస్‌ తదితర అన్ని పార్టీలు ఇదే అంశంపై బేరీజు వేసుకుంటున్నాయి.గతేడాది కంటే ఈసారి తిరుగుబాటు అభ్యర్థుల బెడద ఎక్కువగా ఉంది. ముందుగానే అభ్యర్థులను ఖరారు చేయకుండా చివరి వరకు నెట్టుకు రావడంతోనే ఇది తలనొప్పిగా తయారైందని వివిధ పార్టీల్లో చర్చ జరుగుతోంది. కొన్ని వార్డుల్లో స్వతంత్రులు,ఒక్కరు ఇద్దరే ఉన్నా వారే గట్టిపోటీ ఇస్తున్నారు. మొత్తానికి స్వతంత్రుల పోటు ఎవరికి నష్టం చేకురుస్తోందనేది వేచి చూడాల్సిందే.logo