‘మీతోనేను’ కార్యక్రమంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
మర్పల్లి, డిసెంబర్ 15: గ్రామ సమస్యలు తెలుసుకునేందుకే ‘మీతోనేను’ కార్యక్రమమని, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం మండలంలోని గుండ్లమర్పల్లి, పిల్లిగుండ్ల గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘పల్లె ప్రగతి’ తో 50 ఏండ్ల నుంచి పేరుకుపోయిన సమస్యలు దూరమయ్యాయన్నారు.మురుగు కాలువలు నిర్మించాలని, పొలాల వద్ద, గ్రామాల్లో కరెంటు వైర్లు వేలాడుతున్నాయని వాటిని సరిచేయాలని ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఆయా శాఖల అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడి వాటిని సరిచేయాలని ఆదేశించారు.గుండ్లమర్పల్లిలో మురుగు కాలువల నిర్మాణానికి రూ.నాలుగు లక్షలు, పిల్లిగుండ్లలో మురుగు కాలువల నిర్మాణానికి రూ.నాలుగు లక్షలు, అలాగే పాఠశాల వద్ద ఉన్న ట్రాన్స్ ఫార్మర్ను వేరే చోటుకు మార్చేం దుకు రూ.లక్షా మంజూరు చేస్తానన్నారు. బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, బస్సు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే దృషికి తీసుకురాగా డిపో మేనేజర్‌తో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పించేందుకు కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచులు శివకుమార్, పాండు, జడ్పీటీసీ మధుకర్, వైస్ ఎంపీపీ మో హన్‌రెడ్డి, ఎంపీడీవో వెంకట్రామ్‌గౌడ్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మల్లేశం, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు నాయబ్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, సీనియర్ నాయకులు ప్రభా కర్ గుప్తా, రామేశ్వర్, మధుకర్, అశోక్, సురేశ్ ఆయా శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.