షాద్‌నగర్‌రూరల్, జనవరి 18 : దినదిన అభివృద్ధితో ఇప్పటికే షాద్‌నగర్ నియోజక వర్గం రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాకే ఫరూఖ్‌నగర్ మండలంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలు, తండాలు ఎంతో అభివృద్ధి చెందాయి. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ప్రతి గ్రామం ఎంతో సుందరంగా మారింది. ఇప్పటికే పాత జాతీయ రహదారి రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా పూర్తికావడంతో పాటు గ్రామాల రోడ్ల మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. బీటీ రోడ్ల మరమ్మతుల పట్ల గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని గ్రామాల రోడ్డు మరమ్మతు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని కొండన్నగూడ, శేరిగూడ, మధురాపూర్, బూర్గుల, చెల్కచిల్కమర్రి గ్రామాల రోడ్డు మరమ్మతుల పనులకు నిధులను మంజూరు చేయిండం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు
రూ.10.4 కోట్లతో రోడ్లకు మహర్దశ
బూర్గుల నుంచి చిల్కమర్రి గ్రామానికి రూ.4.15 కోట్లు, బాలాజీ ఫ్యాక్టరీ నుంచి జేపీ దర్గా వయా కొండన్నగూడ గ్రామం వరకు రూ.3 కోట్లు, మధురాపూర్ నుంచి బూర్గుల వరకు రూ.1.15 కోట్లు, బూర్గుల నుంచి పోతురాజుగడ్డ తండా వరకు రూ.59 లక్షలు, మధురాపూర్ నుంచి కమ్మదనం వరకు రూ. 55 లక్షలు, శేరిగూడ వరకు రూ.60 లక్షలు వెచ్చించనున్నారు.
సంతోషంగా ఉంది
ఉమ్మడి పాలనలో మా గ్రామం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గ్రామ రూపురేఖలు మారిపోయాయి. బీటీ రోడ్ల మరమ్మతులకు నిధులు రావడం వల్ల మరింత అభివృద్ధికి అవకాశం ఉంది. గ్రామ రోడ్డు మరమ్మతు పనులకు రూ.3 కోట్లు వెచ్చించడం చాల సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు
– శ్రీనివాస్‌యాదవ్, కొండన్నగూడ సర్పంచ్
మరింత అభివృద్ధి జరుగుతుంది
గ్రామ రోడ్డు మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టడం చాల సంతోషంగా ఉంది. మా గ్రామం మరింత అభివృద్ధి చెందుతుంది. రవాణా వ్యవస్థ బాగుంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం
–నర్సింహులు, కమ్మదనం సర్పంచ్, ఫరూఖ్‌నగర్ మండలం.