గౌరవ వేతనం పెంపుపై సంబురాలు
ఆమనగల్లు, జనవరి 7: ఒకేసారి 30 శాతం గౌరవ వేత నం పెంపును హర్షిస్తూ ఆశ వర్కర్లు శుక్రవారం సంబురాలు చేసుకున్నారు. ఆమనగల్లు ప్రభుత్వ దవాఖాన ఆవరణలో సీఎం కేసీఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఫ్లెక్సీకి ఆశవర్కర్లు, వైద్య సిబ్బంది క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సాయిరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చి ఉద్యోగుల పక్షపాతిగా నిలిచారని కొనియాడారు. సీఎం కేసీఆర్ సల్లంగా ఉండాలని ఆశ వర్కర్ల కుటుంబాల సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమం లో వైద్యసిబ్బంది తిరుపతిరెడ్డి, లక్ష్మి, సరోజ, నిర్మల, విజ య, వసంత, సరోజ, సంతోష, చంద్రకళ పాల్గొన్నారు.
పండుగ వేళ తీపి కబురు
హయత్‌నగర్ రూరల్, జనవరి 7: ఒకేసారి 30 శాతం గౌరవ వేతన పెంపుతో ఆశ వర్కర్లకు సంక్రాంతి పండుగ ముందే వచ్చింది. వారి కుటుంబాల్లో ఆనందం వెల్లి విరి సింది. మూడేండ్ల కిందట ఆశ వర్కర్ల వేతనం నెలకు రూ. 6 వేలు ఉండగా.. ప్రభుత్వం అప్పట్లోనే దాదాపు 30 శా తం పెంచింది. దీంతో నెల వేతనం రూ.7500కు చేరింది. ఇప్పటివరకు అదే వారికి అందుతున్నది. తాజాగా మరో సారి 30 శాతం పెంపుతో గౌరవ వేతనం రూ.9,750కు చేరనున్నది. వేతన పెంపుపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఆశ వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పండుగ వేళ సర్కా రు తీపి కబురు చెప్పిందని సంబుర పడుతున్నారు.
చాలా సంతోషంగా ఉంది
గతంలో గౌరవ వేతనంతో కనీస అవసరాలు కూడా తీరేవి కావు. కానీ, తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే వేతనం పెరిగింది. అవసరాలు కూడా తీరుతున్నాయి. గర్భిణుల ను దవాఖానలకు తీసుకెళ్లడం, వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం. మా శ్రమను గుర్తించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. వేతనాలు పెంచినందుకు చాలా సంతోషంగా ఉంది.