తుర్కయాంజాల్, ఫిబ్రవరి 21 : సమష్టి కృషితోనే మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ మునగనూరు 1వ, 2వ వార్డుల్లో సుమారు రూ.89.50 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, వాటర్ పైప్లైన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రైతు బంధు సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కందాడ ముత్యం రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు తాళ్లపల్లి సంగీత, వేముల స్వాతిరెడ్డితో కలిసి శంకుస్థాపన, మునగనూర్ వార్డు కార్యాలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన తపాలా కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. 15వ వార్డులో కౌన్సిలర్ స్వాతి సహకారంతో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను సీఐ వెంకటేశ్వర్లుతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతోనే మున్సిపాలిటీ ప్రగతి సాధిస్తుందన్నారు. తపాలా సేవలను ప్రజలు సద్వినియోగం చేసువాలన్నారు. గ్రామీ ణ ప్రాంతాల్లో కమర్షియల్ బ్యాంక్లు లేవని, ఈ పోస్టాఫీస్లను ఏర్పాటు చేస్తే పొదుపు చేసుకునే సౌలభ్యం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ సౌత్ ఈస్ట్ పోస్టల్ డివిజన్ టీఏవీ శర్మ, అసిస్టెంట్ సూపరింటెండెంట్ కె.విష్ణుజ్యో తి, సావిత్రి, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.
కొహెడ పాఠశాలలో భోజనశాల ప్రారంభం
తుర్కయాంజాల్ రైతు సేవా సహకార సంఘం వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, కొహెడ 4వ వార్డు కౌన్సిలర్ సిద్ధ్దాల్ల జ్యోతీజంగయ్య సొంత ఖర్చుల (సుమారు రూ.10 లక్షలు)తో కొహెడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్మించిన మధ్యాహ్న భోజనశాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ రమావత్ కల్యాణ్ నాయక్, కౌన్సిలర్లు గుండా భాగ్యమ్మ, పుల్లగుర్రం కీర్తన, జ్యోతి, పీఏసీఎస్ డైరెక్టర్లు డి.అంజయ్య, వై.జగన్మోహన్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ గౌడ్, ప్రభువర్ధన్ రెడ్డి, బలదేవ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.