కొడంగల్, మే 8: పట్టణంలో ప్రతి బుధవారం సంత జరుగుతుంది. ఈ సంతకు తాం డూర్, పరిగి, షాద్‌నగర్ వంటి దూర ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటక వ్యాపారస్తులు కూడా అమ్మకాలు జరిపేందుకు వస్తుంటారు. ఏండ్ల కాలంగా నిర్వహిస్తున్న సంతలో వ్యాపారాలు కొనసాగించేందుకు ఎటువంటి సౌకర్యాలు లేవు. తాగునీరు, మరుగుదొడ్ల వంటి వసతులు అందుబాటులో లేక వ్యాపారులు త్రీవంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తున్నారు. కొనుగోలు చేసే వినియోగ దారులు కూడా పార్కింగ్ సౌకర్యాలు లేక ఇబ్బం దులు పడేవారు. కొడంగల్ మున్సిపాలిటీగా ఏర్పాటు కావడంతో మంత్రి కేటీఆర్ మున్సి పల్ అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.15కోట్లు మంజూరు చేశారు. ఇందులో రూ.కోటి నిధుల తో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేపడుతున్నారు. కూరగాయలతో పాటు మాంసం, చేపల అమ్మకాలు ఇక్కడ కొనసాగుతాయి. సకల సౌకర్యాలతో మార్కెట్‌ను నిర్మిస్తు న్నారు. ప్రస్తుతం పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. మార్కెట్ నిర్మాణం పనులు కొనసాగుతున్న కారణంగా ప్రస్తుతం పట్టణంలోని ఎస్బీహెచ్ బ్యాంకు ముందున్న స్థలంలో సంత, రోడ్డు పక్కన వ్యాపారాలు కొనసాగించుకొంటున్నట్లు వ్యాపారస్తులు తెలిపారు.