ఇబ్రహీంపట్నం రూరల్, ఫిబ్రవరి 13 : మేడారం జాతరలోని సమ్మక్క, సారలమ్మ దేవతలకు మొక్కలు చెల్లించుకోవాలనుకునే భక్తులకు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ సహకారంతో, ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో కార్గో పార్సిల్ సేవలను ప్రారంభించినట్లు డిపో మేనేజర్ బాబునాయక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అమ్మవార్లకు బంగారం (బెల్లం) 5కిలోల వరకు మొక్కులు చెల్లించుకునేవారికి ఆర్టీసీ కొరియర్ ద్వారా మేడారానికి కేవలం రూ.450ఖర్చు మాత్రమే అవుతుందని తెలిపారు. ఇక్కడ నుంచి జాతరకు చేరుకోలేని భక్తులకు ఆర్టీసీ కార్గో బస్సులు స్వయంగా ఇక్కడ నుంచి పంపిన ముడుపులను సిబ్బంది గద్దెల వరకు చేర్చుతారని తెలిపారు. తిరిగి భక్తులకు ప్రసాదం, పసుపు, కుంకుమతో పాటు అమ్మవార్ల ఫొటోలను తిరిగి కార్గో ద్వారా అందజేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ఇబ్రహీంపట్నం డిపో పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఎం తెలిపారు. ఇతర వివరాలకు 9154298791 లేదా 7013969739లను సంప్రదించాలని ఆయన కోరారు.