చేవెళ్ల, షాద్‌నగర్ ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, అంజయ్యయాదవ్
షాబాద్, ఫిబ్రవరి 20 : రాష్ట్రంలో క్రీడారంగాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చేవెళ్ల, షాద్‌నగర్ ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ఎల్గనమోని అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం షాబాద్ మండల కేంద్రంలోని పీఆర్ఆర్ స్టేడియంలో జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన దివంగత రాజేందర్‌రెడ్డి మెమోరియల్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీని వారు ప్రారంభించారు. అనంతరం రాజేందర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లసానికి ఎంతగానో దోహదపడుతాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల యువకులు క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. ఆటలో గెలుపోటములు సమానంగా స్వీకరించి లక్ష్యం దిశగా ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ..క్రీడలతో గ్రామాల మధ్య స్నేహ సంబంధాలు ఏర్పడుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ చల్లా శేఖర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కొలన్ ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింగ్‌రావు, ఆర్గనైజర్లు మహేశ్‌యాదవ్, రమేశ్‌యాదవ్, మల్లారెడ్డి, ధనుంజయ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎంఏ మతీన్, జడల రాజేందర్‌గౌడ్, వెంకట్‌యాదవ్, ముఖ్రంఖాన్, మునీర్, రాజేందర్‌రెడ్డి, కృష్ణగౌడ్, ప్రదీప్, సత్యం, వెంకట్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి తదితరులున్నారు.