కడ్తాల్, నవంబర్ 5 : హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ సిద్ధాంతాలు మరిచి కుమ్మక్కయ్యాయని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో స్థానిక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను ఓడించడానికి బద్ధ శత్రువులైన రెండు జాతీయ పార్టీలు ఒక్కటయ్యాయని విమర్శించారు. 2018 సాధారణ ఎన్నికల్లో 61,121 ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఉప ఎన్నికలో 3112 ఓట్లే రావడానికి కారణమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు అమ్ముడుపోయి బీజేపీ అభ్యర్థికి ఓట్ల వేయించారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను గౌరవిస్తున్నదని, ప్రజా తీర్పును శిరసావహిస్తున్నదన్నారు. గ్రామస్థాయి నుంచి టీఆర్ఎస్ బలంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఈ నెల 29న వరంగల్‌లో నిర్వహించే విజయగర్జనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వీరయ్య, ఏఎంసీ డైరెక్టర్లు లాయక్‌అలీ, నర్సింహాగౌడ్, సర్పంచ్‌లు హరిచంద్‌నాయక్, సాయిలు, జంగయ్య, ఎంపీటీసీలు గోపాల్, మంజుల, ఉప సర్పంచ్ రామకృష్ణ, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, చంద్రమౌళి, లక్పతినాయక్, సేవ్యానాయక్, పాండునాయక్, రాఘవచారి, బాలకృష్ణ, యాదయ్య పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కడ్తాల్, నవంబర్ 5 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ మహేందర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే అందజేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. రెండేండ్లలో కేఎల్ఐ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలతో కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందజేస్తామన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ..
మండల కేంద్రానికి చెందిన బ్రహ్మచారికి రూ.2 లక్షలు, మహేశ్‌కు రూ.62, 500, గాన్గుమార్లతండాకి చెందిన హరిలాల్నాయక్కు రూ.60 వేలు, కిష్టారాంపల్లికి చెందిన బాలుకు రూ.39 వేలు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అందజేశారు.
8న ఏఎంసీ పాలక మండలి ప్రమాణం
ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల 8న ఆమనగల్లులోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ తెలిపారు. అదే విధంగా పట్టణంలో నిర్మించిన రైతువేదికను ప్రారంభించి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కి, గ్రంథాలయ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి హాజరవుతారని ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్‌నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచ్‌లు రవీందర్‌రెడ్డి, కృష్ణయ్యయాదవ్, యాదయ్య, తులసీరాంనాయక్, హరిచంద్‌నాయక్, ఎంపీటీసీలు గోపాల్, శ్రీనివాస్‌రెడ్డి, ఉప సర్పంచ్‌లు రామకృష్ణ, వినోద్, రైతుబంధు సమితి సభ్యులు పరమేశ్, చందోజీ, వీరయ్య, ఏఎంసీ డైరెక్టర్లు పాల్గొన్నారు.
అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన
మండలంలోని గౌరారంలో ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. గౌరారంలో అదనపు గదుల నిర్మాణానికి రూ.20లక్షలు కేటాయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నిట్టనారాయణ, జోగు వీరయ్య, సింగిల్‌విండో చైర్మన్ వెంకటేశ్, ఏఎంసీ వైస్ చైర్మన్ గిరియాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అర్జున్‌రావు, డైరెక్టర్లు సుభాశ్, రమేశ్, వెంకటయ్య, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.