ఇబ్రహీంపట్నంరూరల్, ఫిబ్రవరి 20 : ఎందరో అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధించుకోగలిగామని, తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలబడుతున్నదని టీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్‌కుమార్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటులో తన ప్రాణాలను అర్పించిన సిరిపురం యాదయ్య వర్ధంతిని ఆదివారం ఇబ్రహీంపట్నంలోని అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించారు. ముందుగా చెరువుకట్టపై గల అమరవీరుల స్థూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నాయకులు కర్నె అరవింద్, కానుగుల మహేశ్, విక్రమ్, రామలింగం, లింగరాజు, రమేశ్, శేఖర్, జగదీశ్వర్, రాజు, వినోద్ తదితరులున్నారు.
అమరుల త్యాగాలు వెలకట్టలేనివి
ఆమనగల్లు : మలిదశ తెలంగాణ పోరాటంలో అసువులు బాసిన అమరుల త్యాగాలు వెలకట్టలేనివి అని టీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు విజయ్‌రాథోడ్ అన్నారు. ఆదివారం మండలంలోని మేడిగడ్డతండాలో అమరుడు సిరిపురం యాదయ్య 12వ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో తండావాసులు నవీన్, రమేశ్, రాజు, గోపి, బుజ్జి. మోతీ, తదితరులు పాల్గొన్నారు.