కడ్తాల్, ఫిబ్రవరి 23 : ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకెళ్లి ప్రజల భాగస్వామ్యంతో మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడ్తాల్ మండలంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలాగే విడుతల వారీగా దళితబంధు పథకాన్ని అందజేస్తామని పేర్కొన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని 330 పాఠశాలలలను అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం ప్రజాప్రతినిధులు పలు సమస్యలను సభలో ప్రస్తావించారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
మండలంలోని పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. మండల పరిధిలోని రావిచేడ్ గ్రామానికి చెందిన నగేశ్‌కి రూ.2,50,000లు, మక్తమాదారం గ్రామానికి చెందిన యాదయ్యకి రూ.లక్ష, గాన్గుమార్లతండాకి చెందిన రక్కికి రూ.13 వేలు, చల్లంపల్లి గ్రామానికి చెందిన శంకరయ్యకి రూ.7 వేల చెక్కులను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ మహేందర్‌రెడ్డి, ఎంపీడీవో రామకృష్ణ, వైస్ ఎంపీపీ ఆనంద్, ఎంపీటీసీలు గోపాల్, లచ్చిరాంనాయక్, ఉమావతి, మంజుల, కోఆప్షన్ సభ్యుడు జహంగీర్‌బాబా, సర్పంచ్‌లు లక్ష్మీనర్సింహారెడ్డి, తులసీరాంనాయక్, యాదయ్య, కృష్ణయ్యయాదవ్, భారతమ్మ, సులోచన, హంశ్య, సుగుణ, సేవ్యాబావోజీ, వ్యవసాయశాఖ ఏవో శ్రీలత, పశువైద్యాధికారి భానునాయక్, ఏఈలు పరమేశ్, శ్రీధర్, సృజన, వాగ్దేవి, ఏపీఏం రాజేశ్వరి, ఏపీవో అంజయ్య, ఐసీడీఎస్, ఆర్అండ్బీ, ఇరిగేషన్, ఎన్ఆర్ఈజీఎస్, పోలీస్, అటవీ, ఎక్సైజ్‌శాఖ అధికారులు పాల్గొన్నారు.