సోమవారం 25 జనవరి 2021
Rajanna-siricilla - Dec 01, 2020 , 03:09:18

పెద్దింటికి ‘రామా చంద్రమౌళి’ పురస్కారం

పెద్దింటికి ‘రామా చంద్రమౌళి’ పురస్కారం

రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్‌కుమార్‌ను ‘రామా చంద్రమౌళి రాష్ట్రస్థాయి సాహిత్య పురస్కారం వరించింది. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన మిలియన్‌ మార్చ్‌ సంఘటన ఆధారంగా చేసుకొని అశోక్‌కుమార్‌ ఇటీవల రాసిన లాంగ్‌ మార్చ్‌ నవలకుగాను ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు అవార్డు కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ పురుషోత్తం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే వరంగల్‌లో జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. గంభీరావుపే ట మండలం భీమునిమల్లారెడ్డిపేటకు చెందిన అశోక్‌ నవల, కథలు, సామాజిక వ్యాసాలతో పాటు పది సి నిమాలకు స్క్రిప్ట్‌ అందించారు. నంది అవార్డుతో పాటు మూడు సార్లు తెలుగు యూనివర్సిటీ నుంచి పురస్కారాలు అందుకున్నారు. కాగా, పురస్కారం రావడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.logo