ఆదివారం 17 జనవరి 2021
Rajanna-siricilla - Nov 27, 2020 , 00:12:37

సమ్మె సక్సెస్‌

 సమ్మె సక్సెస్‌

కేంద్రం అవలంబిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం చేపట్టిన సార్వత్రిక సమ్మె సక్సెస్‌ అయింది. అన్ని పార్టీల అనుబంధ సంఘాలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి.ఊరూరా ర్యాలీలతో హోరెత్తించాయి. ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.మోదీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించాయి. 

- సిరిసిల్ల నెట్‌వర్క్‌

కదిలివచ్చిన కార్మికులు, కర్షకులు

ఊరూరా ర్యాలీలు, ప్రదర్శనలు

ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు

కేంద్రానికి వ్యతిరేకంగా హోరెత్తిన నినాదాలు

కలెక్టరేట్‌:    సిరిసిల్ల పట్టణంలో కార్మిక సంఘాలుటీఆర్‌ఎస్‌కేవీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, న్యూ ఏఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీలు తీశారు. కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలి పారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్‌ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.  కార్మిక చట్టాలను తుంగలో తొక్కడం సిగ్గుచేటన్నారు.  ఇప్పటికైనా కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 8 గంటలు పని విధానాన్ని అమలు చేయాలని, కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ కేవీ నాయకులు టీ లక్ష్మణ్‌, సిరిపురం గంగరాజం, సీ ఐటీయూ రాష్ట్ర నేతలు కూరపాటి రమేశ్‌, మూ షం రమేశ్‌, ఏఐటీయుసీ నేతలు సా మల మల్లే శం, బూర శ్రీను, పోలు కొమురయ్య ఉన్నారు. 

సిరిసిల్ల రూరల్‌: తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్‌టైల్‌ పార్క్‌ ప్రధాన గేటు ఎదుట కార్మికులతో కలిసి కార్మిక సంఘాల నాయకులు ధర్నా చేశారు.  కార్యక్రమంలో మూషం రమేశ్‌, కోడం రమణ, మోర అజయ్‌ ఉన్నారు.

వీర్నపల్లి :  మండలకేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ తీసి తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు మల్లారపు ప్రశాంత్‌,  ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మల్లారపు అరుణ్‌, నేతలు నరేందర్‌, దేవ య్య, సురేశ్‌, రామస్వామి పాల్గొన్నారు. 

వేములవాడ: కేంద్రం అవలంబిస్తున్న ప్రజా, కా ర్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిద్దామని రాష్ట్ర మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఉ పాధ్యక్షుడు గుర్రం అశోక్‌ అన్నారు.  సమ్మెలో భా గంగా మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయీస్‌ యూ ని యన్‌, ఏఐటీయూసీ నేతలు ఆమర వీరుల స్తూ పం నుంచి తెలంగాణ చౌక్‌  దాకా ర్యాలీ తీశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు, మున్సిపల్‌ ఎంప్లా యీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు మల్లేశం, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, ముంజ రమేశ్‌, సగ్గు శ్రీనివాస్‌ ఉన్నారు. 

కోనరావుపేట: మండలకేంద్రంలో కార్మికులు ర్యా లీ తీసి నిరసన తెలిపారు.  కేవీపీఎస్‌ జిల్లా కార్య దర్శి ఎరవెల్లి నాగరాజు, సీఐటీయూ మండ లా ధ్యక్షుడు నూనె లింగయ్య,  కొండయ్య, రమేశ్‌, శంకర్‌, నర్సయ్య, లక్ష్మి, పోచవ్వ పాల్గొన్నారు.

బోయినపల్లి:  మండలకేంద్రంలో హమాలీ కార్మి కులు, ఆశ కార్యకర్తలు, బీడీ వర్కర్లు, సుతారి కా ర్మికులు నిరసన తెలిపారు.  బస్టాండ్‌ నుంచి ర్యా లీగా వెళ్లి తహసీల్దార్‌ కార్యాలయంలో  ఇన్‌చార్జి తహసీల్దార్‌ మధుసూదన్‌రెడ్డికి వినతిపత్రం స మర్పించారు. ఇక్కడ కార్మిక సంఘాల నాయకు లు, తదితరులు ఉన్నారు.

ఇల్లంతకుంట: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్య తిరేక విధానాలపై కార్మిక సంఘం నాయకులు   తహసీల్దార్‌ రాజిరెడ్డికి వినతి పత్రం అందజేశారు.   వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గన్నారం నర్సయ్య,  సీఐటీయూ  మండలా ధ్యక్షు డు సావనపెల్లి రాములు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్య క్షుడు మంద అనిల్‌, ఆశ కార్యకర్తల మండల కన్వీ నర్‌ సొల్లు శాంత, గ్రామ పంచాయతీ యూని య న్‌ కన్వీనర్‌ మల్లయ్య ఉన్నారు.

సిరిసిల్ల/ముస్తాబాద్‌: సీఐటీయూ ఆధ్వర్యంలో ముస్తాబాద్‌లో ర్యాలీ తీశారు.యూనియన్‌  జిల్లా కార్యదర్శి మేర అంజయ్య,  గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం అధ్యక్షుడు మండలాధ్యక్షుడు జెల్ల లక్ష్మణ్‌, పోచ రాములు,  గోవింద్‌,  బా ల్‌ రెడ్డి, సంపత్‌, పిట్ల రంగయ్య, యాదగిరి, చిలుకల రాజేం దర్‌, బూదయ్య, తదితరులు పాల్గొన్నారు.