మంగళవారం 01 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Feb 15, 2020 , 00:35:12

అఖండ మెజార్టీతో గెలుస్తాం

అఖండ మెజార్టీతో గెలుస్తాం

ముస్తాబాద్‌: సహకార సంఘాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులు అఖండ మెజార్టీతో విజయం సాధిస్తారని పోత్గల్‌ సహకార సంఘం మాజీ చైర్మన్‌ తన్నీరు బాపురావు ధీమా వ్యక్తంచేశారు. పోత్గల్‌ సహకార సంఘం చైర్మన్‌ రేసులో ఉన్న తన్నీరు బాపురావు ఎన్నికల ప్రచారానికి చివరి రోజు శుక్రవారం ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా బాపురావు మాట్లాడుతూ, మంత్రి కేటీఆర్‌ సహకారం, ఏడేళ్లగా సంఘం అభివృద్ధికి చేసిన సేవలే పార్టీ అభ్యర్థులను అఖండ మోజార్టీతో గెలిపిస్తాయని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉం టూ సేవ చేశాననీ, మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. ఇప్పటికే పార్టీ బలపరిచిన ఏడుగురు డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. ఎన్నికల్లో ఇతర పార్టీల అభ్యర్థుల గెలుపు నామమాత్రమేనని స్పష్టం చేశారు. అభివృద్ధి చేసేవారికి రైతులు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్‌, ఎంపీటీసీ కొండని బాలకిషన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు డాక్టర్‌ చంద్రశేఖర్‌రావు, రవీందర్‌రావు, రాంమోహన్‌రావు, రాజేశ్వర్‌రావు, గీస శంకర్‌, పారిపెల్లి శ్రీనివాస్‌, గన్నె అంజయ్య, బండ అంజయ్య, మైసాగౌడ్‌, జోగరావు, విశ్వనాథం, గరుగుల రాంచంద్రంగౌడ్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.