అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం 12 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. 14 చోట్ల 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా గోదావరి ఉప్పొంగుతున్నది. రాష్ట్రంలోని గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు మహారాష్ట్రలోని ప్రాజెక్టుల నుంచి వరద వస్తున్నది.