e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, April 16, 2021
Advertisement
Home పెద్దపల్లి ఫూలేను స్ఫూర్తిగా తీసుకోవాలి

ఫూలేను స్ఫూర్తిగా తీసుకోవాలి


పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
జిల్లా కేంద్రంలో ఫూలే విగ్రహ నిర్మాణానికి భూమిపూజ


పెద్దపల్లిటౌన్‌, ఏప్రిల్‌ 7: మహాత్మా జ్యోతిబా ఫూలేను స్ఫూర్తిగా తీసుకోవాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం అమర్‌నగర్‌ పాతకోర్టు చౌరస్తా వద్ద ఫూలే విగ్రహ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళిత, బహుజనులు రాజకీయాల్లో రాణించాలన్నారు. కౌన్సిలర్లు నూగిళ్ల మల్లయ్య, లైసెట్టి భిక్షపతి, తూముల సుభాష్‌రావు, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ సురేందర్‌, కో ఆప్షన్‌ సభ్యుడు ఫహీం, నాయకులు శ్రీధర్‌, శ్రీనివాస్‌, ప్రశాంత్‌, తిరుపతి, శ్రీమా న్‌, సంతోష్‌, శ్రీనివాస్‌, దేవరాజు, నవీన్‌ పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే ‘దాసరి’
కోనరావుపేటలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఇంటికో బోనంతో మహిళలు ఆలయానికి వెళ్లారు. దేవతామూర్తులకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యేను యాదవ సంఘం నాయకులు సన్మానించారు. ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, సర్పంచులు దారబోయిన నరసింహం, మేచినేని సంతోష్‌రావు, ఎంపీటీసీలు మొగురం రమేశ్‌, తమ్మడవేని మల్లేశం, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శాతళ్ల కాంతయ్య, నాయకులు రవీందర్‌, శ్రీనివాస్‌, రాజేశం, తిరుపతి, రాయమల్లు, రామయ్య తదితరులు పాల్గొన్నారు.

రేణుకా ఎల్లమ్మ ఉత్సవాల్లో..
నాంసానిపల్లిలో రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు నిర్వహిస్తుండగా ఆలయాన్ని బుధవారం ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి దర్శించుకుని పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కునారపు రేణుకాదేవి, వైస్‌ఎంపీపీ పల్లె కుమార్‌గౌడ్‌, మాజీ వైస్‌ ఎంపీపీ పోతుగంటి రాజుగౌడ్‌, సర్పంచ్‌ ఆళ్ల రాజిరెడ్డి, నాయకులు ఆకుల మహేందర్‌, ఈరవేని రమేశ్‌, బోడకుంట చినస్వామి, వీరగోని మహేందర్‌, సదయ్య, మల్లయ్య, జలంధర్‌, బండి శేఖర్‌, మొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఫూలేను స్ఫూర్తిగా తీసుకోవాలి

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement