Khaja Mohijuddin | మా తండ్రి హత్యకు కారణం కాంగ్రెస్ నాయకుడు ఆలం ఖానే అని ఖాజా మోహిజుద్దీన్ హత్యపై అతని కుమారుడు ఫర్హాన్ ఆరోపించాడు. దుండగులు కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రగాయాలైన ఖాజా మొయినుద్దీన్ ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ మృతి చెందాడు. ఈ క్రమంలో ఫర్హాన్ మాట్లాడుతూ.. మా తండ్రి వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడేందుకు కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాడని చెప్పాడు.
వక్ఫ్ బోర్డు ఆస్తులను ఆలం ఖాన్, అతడి తండ్రి ఆక్రమించి కాలేజీలు నిర్మించారని.. వాటి గురించి ఎప్పటినుండో కేసులు వేస్తూ.. మా ఫాదర్ ఖాజా మోహిజుద్దీన్ పోరాటం చేస్తున్నారని ఫర్హాన్ తెలిపాడు. గత ఆరు నెలల క్రితం అలంఖాన్ మా ఆఫీసుకు వచ్చి నన్ను బెదిరించాడు. గతంలో మా ఆఫీసులకు వచ్చి మరీ దాడులు చేశారు. మా తండ్రిపై దాడి జరగడం ఇది ఆరోసారి. ఇప్పుడు నాకు గానీమా కుటుంబానికి కానీ ఏం జరిగినా ఆలం ఖాన్ దే బాధ్యత అని ఫర్హాన్ అన్నాడు. నాకు నా కుటుంబానికి రక్షణ కలిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్టు ఫర్హాన్ పేర్కొన్నాడు.
మా తండ్రి పై దాడి జరగడం ఇది ఆరవసారి
మా తండ్రి హత్యకు కారణం కాంగ్రెస్ నాయకుడు ఆలం ఖానే
వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడేందుకు కొన్ని దశాబ్దాలుగా మా తండ్రి పోరాటం చేస్తున్నాడు
వక్ఫ్ బోర్డు ఆస్తులను ఆలం ఖాన్, అతడి తండ్రి ఆక్రమించి కాలేజీలు నిర్మించారు
వాటి గురించి ఎప్పటినుండో… https://t.co/FGuhY1xgCm pic.twitter.com/My5mosV36W
— Telugu Scribe (@TeluguScribe) May 23, 2026