BRS Dharna | జంటనగరాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని బీఆర్ఎస్ ధర్నా
BRS Dharna | జంటనగరాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయం వద్ద ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
హైదరాబాద్ : జంటనగరాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్‌లోని జలమండలి ( Jalamandali ) కార్యాలయం వద్ద ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ( MLA Sudheer Reddy ) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా (BRS Dharna ) నిర్వహించారు. హైదరాబాద్ నగర ప్రజలు తాగునీటి కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నీళ్లు రావడం లేదని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
నీటి సరఫరాను మెరుగుపర్చకపోతే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ప్రజల బతుకులు బాగుపడతాయన్న ఆశతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని తెలిపారు. కేవలం నీటి సమస్యనే పరిష్కరించకపోతే పరిపాలన ఎలా చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన మిషన్ భగీరథను స్ఫూర్తిగా తీసుకుని నగరంలో నీటి సరఫరాను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.
పాలకులకు, అధికారులకు అనుభవరాహిత్యంతో ప్రజలు ఇక్కట్టు పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్‌కు ప్రజాప్రతినిధులు ఎవరూ లేకపోవడంతో బీఆర్ఎస్ ప్రతినిధులున్న ప్రాంతాలవైపు చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

