మంగళవారం 01 డిసెంబర్ 2020
Peddapalli - Oct 03, 2020 , 06:02:07

రైతన్నల సంక్షేమమే లక్ష్యం

రైతన్నల సంక్షేమమే లక్ష్యం

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి

రాఘవాపూర్‌లో రైతు వేదిక సిద్ధం

పెద్దపల్లిరూరల్‌: రైతన్నల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పథకాలు అమలు చేయిస్తున్నారని పెద్దపల్లి ఎమ్మె ల్యే దాసరి మనోహర్‌ రెడ్డి తెలిపారు. పెద్దపల్లి మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో సుందరీకరణ పనులు, రాఘవాపూర్‌లో పూర్తయిన రైతు వేదికను ఎమ్మెల్యే శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాఘవాపూర్‌లో ముందుగా పనులు పూర్తి చేయడం సంతోషకరమన్నారు. సర్పంచ్‌ వెంకటేశాన్ని అభినందించారు. మిగతా సర్పంచులందరూ రాఘవాపూర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్‌ గౌడ్‌, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మర్కు లక్ష్మణ్‌, సర్పంచ్‌ ఆడెపు వెంకటేశం, మాజీ సర్పంచ్‌ అర్కుటి రామస్వామి యాదవ్‌, నాయకులు బొడ్డు చంద్రయ్య యాదవ్‌, గాండ్ల సతీశ్‌, డొంకెన రమేశ్‌, ముత్యం రాజయ్య, కుమ్మరి భిక్షపతి తదితరులున్నారు.

వేదికల పరిశీలన

పాలకుర్తి: పాలకుర్తి మండలం పాలకుర్తి, పుట్నూర్‌, కుక్కలగూడూర్‌ క్లస్టర్లలో నిర్మిస్తున్న రైతు వేదికలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ శుక్రవారం పరిశీలించారు. గడువులోగా రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. కుక్కలగూడూర్‌లో రైతు వేదిక వివరాలను సర్పంచ్‌ గోండ్ర చందర్‌ను అడిగి తెలుసుకున్నారు. పనులు ఆలస్యంగా జరుగుతుండడంపై కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు వేదికలు, సెగ్రిగేషన్‌ షెడ్లు, ప్రకృతి వనాలు వెంటనే పూర్తి చేయాలని సర్పంచులను ఆదేశించారు.