గురువారం 02 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 19, 2020 , 02:48:50

ప్రకృతిని కాపాడితేనే మనుగడ సాధ్యం

ప్రకృతిని కాపాడితేనే మనుగడ సాధ్యం

పెద్దపల్లి టౌన్‌: ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడితేనే మానవాళి మనుగడ సాధ్యమవుతుందని ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ సంఘం సభ్యురాలు బ్రహ్మకుమారీ మనీషా పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో నిర్వహించనున్న అమర్‌నాథ్‌ మంచులింగ దివ్యదర్శనం ఏర్పాట్లను మంగళవారం ఆమె పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..   మహాశివరాత్రి వేడుకల సందర్భంగా పెద్దపల్లి లో అమర్‌నాథ్‌ మంచులింగ దివ్య దర్శనం ఏర్పాటు చేశామని తెలిపారు. అందరికీ స్నేహపూర్వకంగా ఆహ్వా నం తెలుపుతూ మహాకార్యంలో పాల్గొనాలని కోరారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారయాత్ర కొనసాగుతుందని వివరించారు. పట్టణంలో ప్రజలకు తెలిసేలా  బ్యాన ర్లు ఏర్పాటు చేశామన్నారు. అమర్‌నాథ దివ్య దర్శనంలో పరమశివుని పూజా ప్రతిమయైన శివలింగం హిమాలయ పర్వతాల మధ్య మంచు లింగమై అమరనాథుడిగా పూజలందుకుంటుందని చెప్పారు. పెద్దపల్లి పట్టణంలోని ప్రభు త్వ జూనియర్‌ కళాశాల మైదానంలో శివలింగం యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఆవిష్క రించే కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. బుధవారం సాయంత్రం 4గంటలకు ర్యాలీ నిర్వహించి దివ్య దర్శనం కల్పించనున్నట్లు చెప్పారు. సమావేశంలో సభ్యురాళ్లు నాగమణి, మీనాక్షి, సారిక తదితరులు పాల్గొన్నారు. logo
>>>>>>