e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, January 22, 2022
Home ఎడిట్‌ పేజీ కొత్త‘కొండ’పై ట్రెక్కింగ్‌

కొత్త‘కొండ’పై ట్రెక్కింగ్‌

కొత్తకొండ హిల్స్‌ సాహస పర్యాటక కేంద్రం హన్మకొండ నుంచి సుమారు 34 కి.మీ, హుస్నాబాద్‌ నుంచి 34 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి మాజీ ప్రధాని పీవీ స్వగ్రామం వంగర 12 కిలో మీటర్ల దూరం. ఇక్కడ పురాతనమైన వీరభద్రస్వామి ఆలయం ఉన్నది. కొండపై కాకతీయరాజుల
కట్టడాలున్నాయి. ఏటా జనవరిలో కొత్తకొండ వీరభద్రస్వామి జాతర జరుగుతుంది.

మార్చిలో ‘ఆక్టో టీం’ జిల్లా పర్యాటకశాఖతో కలిసి వరంగల్‌ జిల్లాలోని అనేక సాహస పర్యాటక ప్రాంతాలను సర్వే చేసింది. దీనివల్ల హన్మకొండ నడిబొడ్డున గల బోడుగుట్ట, కొత్తకొండ ప్రాంతాన్ని సర్వే చేయడానికి అవకాశం లభించింది. మొదట మేం ట్రెక్కింగ్‌ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి కొండపై ఉన్న శిస్తు బండ(పీవీ సమిట్‌)ను చేరుకొని అక్కడి వాతావరణ పరిస్థితులను పరిశీలించాం. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 2,700 అడుగుల ఎత్తులో ఉన్నది. వాతావరణం హర్స్‌లి హిల్స్‌ను మరిపిస్తుంది. కొండపై ైక్లెంబింగ్‌, ర్యాపిలింగ్‌ ట్రయల్‌ రన్‌ నిర్వహించాం. ఈ ప్రాంతం, ప్రకృతి సాహస పర్యాటక ప్రాంతానికి అనువుగా ఉన్నదనిపించింది.

- Advertisement -

కరోనా కారణంగా ‘పంగల్‌ చుల్లా’ పర్వతంపై అనుమతులు లేకపోవడం వల్ల మేం నిర్వహించవలసిన హిమాలయ పర్వత సాహసయాత్ర నిలిచిపోయింది. దీంతో మా దృష్టి కొత్తకొండపై పడింది. కొత్తకొండను ఎక్కటానికి మేం ఓ టీంను ఏర్పర్చుకొని సంసిద్ధులమయ్యాం. ఈ జట్టుకు కొమరంభీమ్‌ జిల్లా భీమసగొండి గ్రామానికి చెందిన కొలం తెగకు చెందిన అడ్వెంచర్‌ టూరిజం బ్రాండ్‌ అంబాసిడర్‌ మాధవి కన్నిభాయి నాయకత్వాన జూన్‌ 25న బయల్దేరాం.

మొదట సుమారు 500 ఏండ్ల పురాతన శివాలయాన్ని చేరుకొని అక్కడ భవిష్యత్తులో బేస్‌ క్యాంప్‌ ఏర్పాటు గురించి పరిశీలించాం. పక్కనే నీటి కొలనులను, ఆ తర్వాత అతి పురాతనమైన తామరపూల కొలనును పరిశీలించాం. కొండపైకి ట్రెక్కింగ్‌ చేస్తూ సుందరమైన విశాల ప్రాంతంలో గుడారాలు వేశాం. అయితే అక్కడున్న శిస్తుబండను అధిరోహించడం పెద్ద సవాలు. విపరీతమైన గాలులు వీస్తుంటాయి. నిలబడటం కూడా కష్టమే. అన్నింటికంటే ముందు యాంకర్‌ రోప్‌ను పిక్స్‌ చేయడం మా ముందున్న అతి పెద్ద ఛాలెంజ్‌. మాకు కావలసిన టెక్నికల్‌ ఎక్విప్‌మెంట్స్‌, చోక్‌నట్స్‌, సెంట్రీస్‌, రాక్‌ పిట్టర్స్‌ను సిద్ధం చేసుకున్నాం. అప్పటికే సమయం 1.30 గంటలు కావస్తుంది. అయితే లీడ్‌ క్లయింబర్‌ అతి జాగ్రత్తగా పైకి చేరి పిక్స్‌ చేయడంతో మొదటి మహిళ మాధవి కన్నిబాయి సమిట్‌ చేయడం జరిగింది. అక్కడ జాతీయ జెండాను, పీవీ చిత్రపటాన్ని ఎగురవేశాం. ఆ తర్వాత మిగిలినవారు ఒకరి తర్వాత ఒకరం సమిట్‌ చేశాం. ఇలాంటి పర్యటన యువతకు, విద్యార్థులకు ఒక విజ్ఞాన వేదికగా ఉంటుంది. ఇక్కడి ప్రకృతి సహజ వనరులను బట్టి సాహస పర్యాటకానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా డిసెంబర్‌లో పది రోజులు ‘పీవీ మెమోరియల్‌ నేషనల్‌ అడ్వెంచర్‌ ఫెస్టివల్‌’ను నిర్వహించదలిచాం. దేశం నలుమూలల నుంచి వెయ్యి మంది దాకా ఆహ్వానిస్తాం. కొత్తకొండపై ట్రెక్కింగ్‌, రాక్‌ క్లయింబింగ్‌, ర్యాపిలింగ్‌, ఓపెన్‌ స్థలంలో బేస్‌క్యాంప్‌ యాక్టివిటీతో పాటు, సమీపంలోని ఓపెన్‌ స్థలంలో హాట్‌ ఎయిర్‌బెలూన్‌ను కూడా నిర్వహించడానికి సమాయత్తమవుతు న్నాం. వచ్చే ఏడాది అంతర్జాతీయ అడ్వెంచర్‌ ఫెస్టివల్‌ను నిర్వహించి, విదేశీయులను కూడా ఆహ్వానించదలిచాం. తొందర్లోనే ఈ ప్రాంతం జాతీయస్థాయిలో గుర్తింపు పొంది, ప్రధాన పర్యాటక కేం ద్రంగా మారుతుందనడంలో సందేహం లేదు.

కరోనా కారణంగా పంగల్‌ చుల్లా పర్వతంపై అనుమతులు లేకపోవడం వల్ల మేం నిర్వహించవలసిన హిమాలయ పర్వత సాహసయాత్ర నిలిచిపోయింది. మా దృష్టి కొత్తకొండపై పడింది. కొత్తకొండను ఎక్కటానికి మేం ఓ టీంను ఏర్పర్చుకొని సంసిద్ధులమయ్యాం.

-(వ్యాసకర్త: ఫౌండర్‌ యాక్ట్‌)
కె.రంగారావు

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement