అంతర్నిహితం

అంతర్నిహితం
చీరికల చీకటి పల్లకి మీద మనిషి
నీ అంతరంగం బహిర్గతమయ్యాక
ప్రకృతికి రహస్యాలుండవు యిక
బొండిగెలో ఉగ్గవట్టిన బీభత్సం విషపుగాలి
గుండె తిత్తులను కొరికి ఊపిరి తీగను తెంపుతుంది
కాళ్లు చేతులను ఒక్కదగ్గర గుంజికట్టి
కర్రకు కోలాటం వేసి తన భుజాల మీద మోసుకోని
ఎక్కడికో! దిగంతాలకు ఆవల
జీవునాన్ని విసిరివేస్తున్న దీర్ఘదర్శి మృత్యువు
ఉదాసీనమైన చూపులలో ఉత్సాహము చిట్లి
శూన్యం తొర్రల్లో జీవమార్గాలను అన్వేషిస్తుంటావు
గుడ్లమీద పొదిగిన తొండోలే
ఆశ మిట మిట కొట్టుకుంటుంది
నది ఒడ్డున దుఃఖంతో చాకిరేవుకు తల
బాదుకుంటావో! లేదో !
ఆకాశం అమాంతం బళ్ళున విరిగి మీద పడుతుంది
నీకు ఊపిరాడదు
చిలక్కొయ్యకు వేలాడుతున్న లాకర్ తాళంచెవి
వెటకారంగా విరగబడి నవ్వుతుంది
భార్య పిల్లలు బంధువులు
వాళ్ల తొవ్వలు వాళ్లు చూసుకుంటరు
నిర్దయగా కాలం నిన్ను ఈడ్చుకుంటూ
లాక్కెళ్లి అగాథంలో తొక్కేస్తుంది
తనువు తనగాయాలకు లేపనంగా
జ్ఞాపకాల బూడిద రాసుకుంటుంది
అంతర్నిహిత తండ్లాటలో సత్యాన్ని శోధిస్తుంటావు
చితిలో సగంకాలిన కొరకాసు దొరుకుతుంది
మూలుగులు రోదనలు శ్మశానం చావు కచేరి
భయంతో దద్దరిల్లుతోంది విశ్వమంతా
నువ్వు నీ మాయిముంతను ఎంకులాడుకుంటావు
రక్తసిక్తమైన నాజూకు శరీర అంగంగాలకు
ప్రాయశ్చిత్తంగా ప్రకృతిని గుండెలకు అతుక్కుంటావు
ఆశ్చర్యంగా నీ దేహమంతా వేర్లు పుట్టుకొచ్చి
మట్టిలో పచ్చని మొక్కవై మొలకెత్తుతావు..!
డాక్టర్ పొన్నాల బాలయ్య
9908906248
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

