Anna Konidala | పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. ఇన్స్టాగ్రామ్ ఖాతాను డియాక్టివేట్ చేసిన అన్నా
Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, ఆయన సతీమణి అన్నా కొణిదెల తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను డియాక్టివేట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, ఆయన సతీమణి అన్నా కొణిదెల తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను డియాక్టివేట్ చేశారు. దాదాపు 13 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలకాలని ఇద్దరూ పరస్పర అంగీకారంతో నిర్ణయించుకున్నట్లు సోమవారం రాత్రి సంయుక్త ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. జీవితంలో ఎన్నో కీలక నిర్ణయాలు కలిసి పంచుకున్నామని, తమ పిల్లల సంక్షేమం కోసం మంచి స్నేహితులుగా, బాధ్యతగల తల్లిదండ్రులుగా కొనసాగుతామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వ్యక్తిగత పరిణామం నేపథ్యంలో ఎవరూ తమ గోప్యతకు భంగం కలిగించవద్దని వారు కోరారు. పవన్ కల్యాణ్‌ను వివాహం చేసుకున్న తర్వాత అన్నా కొణిదెల తన పేరును మార్చుకోవడం, ఆయన సర్జరీ సమయంలో హెల్త్ అప్డేట్స్ పంచుకోవడం వంటి పోస్టులతో కొద్దికాలంగా ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉన్నారు.
ఇక విడాకుల ప్రకటన వెలువడిన వెంటనే ఆమె తన ఖాతాను డీయాక్టివేట్ చేయడం గమనార్హం. ఇది పవన్ కల్యాణ్‌కు మూడో వివాహం కావడం విశేషం. పవన్ కల్యాణ్ గతంలో 1997లో నందినిని వివాహం చేసుకోగా 2008లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2009లో నటి రేణు దేశాయ్‌ను వివాహం చేసుకోగా, వీరికి అకీరా నందన్, ఆద్య సంతానం. మనస్పర్థల కారణంగా 2012లో రేణు దేశాయ్‌కు కూడా విడాకులు ఇచ్చారు. అనంతరం 2011లో వచ్చిన ‘తీన్ మార్’ సినిమా షూటింగ్ సమయంలో అన్నా లెజ్నేవా (అన్నా కొణిదెల)తో పరిచయం ఏర్పడగా, 2013లో ఆమెను మూడో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు పోలెన అంజనా పవనోవ, మార్ శంకర్ పవనోవిచ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | టాస్ తర్వాత కూడా వరుణుడి ఆట.. చివరకు రద్దయిన భారత్-న్యూజిలాండ్ మ్యాచ్
Anna Konidala | పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. ఇన్స్టాగ్రామ్ ఖాతాను డియాక్టివేట్ చేసిన అన్నా
Shaji Kumar | మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ కన్నుమూత!
Vijay Sethupathi | వరుస సినిమాలతో విజయ్ సేతుపతి బాక్సాఫీస్ దండయాత్ర.. రెండు నెలల్లో రెండు చిత్రాలు..!
Scene Movie | సీన్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. రూ. 150 కోట్లు దాటిన సూర్య సినిమా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

