Khammam | సన్నిహితంగా ఉండటం చూశాడని.. ప్రియుడితో కలిసి 15 ఏళ్ల బాలుడిని హత్య చేసిన మహిళ
Khammam | తమ వివాహేతర బంధం ఎక్కడ బయటపడుతుందోనని ఓ యువకుడితో కలిసి వివాహిత దారుణానికి ఒడిగట్టింది. తాము సన్నిహితంగా ఉండటం చూసిన బాలుడికి కలుపు మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించి హత్య చేసింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Khammam | తమ వివాహేతర బంధం ఎక్కడ బయటపడుతుందోనని ఓ యువకుడితో కలిసి వివాహిత దారుణానికి ఒడిగట్టింది. తాము సన్నిహితంగా ఉండటం చూసిన బాలుడికి కలుపు మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించి హత్య చేసింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. భర్తతో విడిపోయిన అపర్ణ అనే మహిళ చిన్నకోరుకొండి గ్రామంలోని తన అమ్మమ్మ ఇంట్లో నివసిస్తోంది. అదే గ్రామానికి చెందిన అజయ్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అదికాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో పదో తరగతి విద్యార్థి జిల్లెళ్ల రవి (15) చూశాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెబుతానని రవి హెచ్చరించడంతో ఇద్దరూ భయపడిపోయారు. దీంతో రవిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే గత నెల 24న రవిని బయటకు తీసుకెళ్లి కలుపు మందు కలిపిన కూల్ డ్రింక్ తాగించారు. అది తాగిన కొద్దిసేపటికే రవి నోటిలో పొక్కులు రావడంతోపాటు చర్మంపై అలర్జీ లక్షణాలు కనిపించాయి. అనారోగ్యానికి గురైన బాలుడు ప్రశ్నించగా.. కూల్‌డ్రింక్‌లో విషం కలిపినట్లు నిందితులు చెప్పారు. దీంతో భయపడిన రవి వెంటనే తన తండ్రికి, బంధువులకు విషయం చెప్పాడు. కుటుంబ సభ్యులు తొలుత ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రవి మృతి చెందాడు. బాలుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అపర్ణ, అజయ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Khammam | సన్నిహితంగా ఉండటం చూశాడని.. ప్రియుడితో కలిసి 15 ఏళ్ల బాలుడిని హత్య చేసిన మహిళ
Rishikanth | రామ్ చరణ్ ‘ఆర్సీ17’ మూవీలో నేను లేను.. రూమర్స్‌కు చెక్ పెట్టిన తమిళ నటుడు!
IND vs NZ | టాస్ తర్వాత కూడా వరుణుడి ఆట.. చివరకు రద్దయిన భారత్-న్యూజిలాండ్ మ్యాచ్
Anna Konidala | పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. ఇన్స్టాగ్రామ్ ఖాతాను డియాక్టివేట్ చేసిన అన్నా
Shaji Kumar | మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ కన్నుమూత!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

