18 ఎకరాలు, 200కు పైగా అత్యాధునిక యంత్రాలతో కూడిన ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ ‘టీ-వర్క్స్’ హైదరాబాద్‌లో గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రపంచ దిగ్గజ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ కంపెనీ చైర్మన్, సీఈవో యంగ్ లియూ దీన్ని ప్రారంభించారు. అత్యంత విలువైన సమయం కేటాయించి టీ-వర్క్స్‌కు వచ్చినందుకు మంత్రి కేటీఆర్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరూ తమ తమ మనోగతాలను ఇలా పంచుకున్నారు…
దేశంలోనే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. 8.5 ఏండ్లు దాటి జూన్ 2 నాటికి 9వ వసంతంలోకి అడుగు పెడుతున్నది. ఇన్నేండ్లలో కేసీఆర్ నాయకత్వంలో రాష్ర్టాన్ని సమగ్రంగా అభివృద్ధి చేశాం.ఈ రోజు ఇక్కడికి వచ్చిన మీరు ప్రకటించిన ఉద్యోగాల కల్పన అనే అంశం చాలా గొప్ప ఆనందాన్నిచ్చింది. నిజంగా మీకు కృతజ్ఞతలు.
‘టీ వర్క్స్ ప్రారంభోత్సవానికి వచ్చినందుకు మొదటగా మీకు కృతజ్ఞతలు. నేను ఢిల్లీలో మిమ్మల్ని కలిసినప్పుడు మీరే టీవర్క్స్‌ను ప్రారంభించాలని కోరాను. నేను కోరుకున్నట్టుగానే మీరు మా కోసం సమయం ఇచ్చి, హైదరాబాద్‌కు వచ్చారు. అందుకు చాలా కృతజ్ఞతలు. మీతో పాటు మీ బృందానికి మరోసారి కృతజ్ఞతలు. మా ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్.. సుజయ్ కారంపూరి ఆలోచన వల్లే టీ వర్క్స్ ఈ విధంగా మనకంటికి కనిపిస్తున్నది. అతనొక్కడే ఎక్కువగా ఎంతో తీవ్రంగా శ్రమించారు. ప్రభుత్వం తరపున మా బృందం కలిసి అతనికి పూర్తిస్థాయిలో సహకరించింది. సుజయ్ ఒకడే ఎంతో శ్రమించి ‘టీ వర్క్స్’ తుదిరూపం ఇచ్చారు. సుజయ్ బృందంలోని ప్రతి ఒకరికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నా. ‘టీ వర్క్స్’ నిర్మాణంలో వీరంతా కలిసి అద్భుతమైన పనితీరును కనబరిచారు. వారు చాలామంచి ఆలోచనలతో మా దగ్గరికి వచ్చారు. భయంకరమైన కరోనా పరిస్థితుల సమయంలోనూ వెంటిలేటర్ రూపొందించే ఆలోచనతో వచ్చారు. ఒకరోజు నేను ఆఫీసుకు వెళ్లాను ఆ సమయంలో వారు వెంటిలేటర్‌కు సంబంధించిన ప్రొటోటైప్ నమూనాతో అకడ సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ప్రొటోటైప్ ఎలక్ట్రిక్ వెహికల్‌ను కూడా చూపించారు. అది చూసి నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. ఇలా ఎన్నో చేస్తూ చూపిస్తూ వస్తున్నారు. ఈ విషయంలో వారు చాలా శ్రమించారు, దీనికి వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.
చైర్మన్ యంగ్ లియూ మీకు చెప్పదల్చకున్న చాలా ముఖ్యమైన విషయమేమంటే ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు. నా మదిలో ఐటీ అంటే ఐ ఫర్ ఇండియా, టీ ఫర్ తైవాన్ అని భావిస్తున్నాను. దీన్ని నేను చాలా ఎక్కువగా నమ్ముతాను.
ఇండియా సాఫ్ట్‌వేర్‌లో పవర్‌హౌజ్‌గా ఉన్నది. అదే సమయంలో తైవాన్ హార్డ్‌వేర్‌లో అద్భుతాలు సృష్టిస్తున్నది. మన రెండుదేశాలు కలిసి అద్భుతాలు చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వాటిని ఆవిష్కరించేందుకు అవకాశం ఉన్నది. ప్రస్తుతం మేము ‘టీ వర్క్స్’ను ఎందుకు ప్రారంభించామంటే?.. నేటి భారతదేశ యువతకు తయారీరంగంలో మంచి అవకాశాలు ఇవ్వదల్చుకున్నాం. యువతను ఉత్పత్తుల తయారీ ఆవిష్కరణలతో రావాలని కోరుతున్నాం. ప్రపంచస్థాయి ఉత్పత్తులను తయారుచేయాలని ఆశిస్తున్నాం.
తయారీరంగంలో మీరు మాకు బోధించాల్సిన అవసరం ఉన్నది. తద్వారా భారత దేశం ఏం చేయగలదో అది చేస్తుంది. దాంతో ప్రపంచాన్ని లీడ్ చేసే అవకాశం కలుగుతుందని భావిస్తున్నాను. అలాంటి ఆవిష్కరణలకు టీ వర్క్స్ కేంద్రంగా మారుతుందనుకుంటున్నాను. మీరు మా వరకు వచ్చినందుకు మరోసారి మీకు కృతజ్ఞతలు చెప్తున్నా. మా ముఖ్యమంత్రి కేసీఆర్ మిమ్మల్ని కలిశారు. దేశంలోనే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. 8.5 ఏండ్లు దాటి జూన్ 2 నాటికి 9వ వసంతంలోకి అడుగు పెడుతున్నది. ఇన్నేండ్లలో కేసీఆర్ నాయకత్వంలో రాష్ర్టాన్ని సమగ్రంగా అభివృద్ధి చేశాం. ఈ రోజు ఇక్కడికి వచ్చిన మీరు ప్రకటించిన ఉద్యోగాల కల్పన అనే అంశం చాలా గొప్ప ఆనందాన్నిచ్చింది. నిజంగా మీకు కృతజ్ఞతలు. ప్రత్యేక రాష్ట్రం ఉద్యమంలో మాకో నినాదం ఉన్నది. అందులో ఒకటి ఉద్యోగావకాశాలు. అలాంటి ఉద్యోగావకాశాలు మీ ప్రకటనతో నిజం కాబోతున్నాయి. దీంతో తెలంగాణకు చెందిన యువత చాలా సంతోషంగా ఉన్నారు.
భారతదేశంలో మంచి నగరాల్లో హైదరాబాద్ ఒకటని మీరు ప్రత్యక్షంగా చెప్పారు. ఈ రోజు మీరు చెప్పిన మాటతో నేను ఆనందానికి గురవుతున్నాను. ఎక్కువ కాలం మీతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. పలు రంగాల్లో తైవాన్ ఒక గొప్ప దేశం. నేను పలుమార్లు ఆ దేశాన్ని సందర్శించాను. 23 మిలియన్ల జనాభా ఉన్న దేశం అది. కానీ 3 త్రైమాసికాల్లోనే ట్రిలియన్ జీడీపీని నమోదుచేసింది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో సెమీ కండక్టర్స్ పరిశ్రమను టీఎస్ఎంసీ పేరుతో ఏర్పాటుచేశారు. ప్రస్తుతం మీ కంపెనీ ఫాక్స్‌కాన్ 205 బిలియన్ డాలర్ల టర్నోవర్‌తో, ఫార్చూన్ 500 కంపెనీల్లో టాప్ 20లో ఉన్నది. ముఖ్యంగా చెప్పాలంటే లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. దీనికి మీకు ప్రత్యేకంగా అభినందనలు. మీ ఫాక్స్‌కాన్ బృందమంతా కలిసి మ్యాజిక్ చేశారు. మీరు షెన్జెన్లో ఏం చేశారో? చైనాలో ఏం చేశారో? అదేవిధంగా హైదరాబాద్‌లోనూ చేయాలని కోరుకుంటున్నాను. మీ కార్యకలాపాలతో చైనాకు షెన్జెన్ ఎలాగో, ఇండియాకు హైదరాబాద్ అలాగ మారాలని కోరుకుంటున్నా.
– కల్వకుంట్ల తారక రామారావు,రాష్ట్ర ఐటీశాఖ మంత్రి