ముందు వ్యాసంలో చెప్పిన లెక్కలు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నియమించిన రెండు కమిటీలు ప్రకటించినవి. మొదట కుమార్ లలిత్ కమిటీని నియమిస్తే, వారు సమర్పించిన లెక్కలు ఆంధ్ర దోపిడీని చాలా తక్కువగా చూపాయని తెలంగాణ నేతలు తిరస్కరించారు. దానికి ప్రతిస్పందించి లెక్కలను సరిగ్గా తేల్చడానికి అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వశిష్ఠ భార్గవన్ కమిటీని 1969 ఏప్రిల్ 11న నియమించింది ప్రధాని ఇందిర.
ఎవరెక్కడికి వలస వచ్చారు అన్నది లెక్క, ఎవరు నోరు పెట్టుకొని ఎక్కువగా గట్టిగా అరవగలరు అన్నది కాదు. ఆంధ్రులు తెలంగాణకు వచ్చారు. ఇంకా వెయ్యేండ్లు వాళ్లు ఇక్కడున్నా, హైదరాబాద్ తెలంగాణ వాళ్ల జాగీరే. ఇందులో ఏ సందేహం లేదు. మళ్లీ ఆ మాట అంటే ఈ జాగీరు నుంచి వెళ్లిపోవలిసి వస్తుంది, ఆలోచించుకోండి.
ఈ కమిటీలో విహారీ మాధుర్, హరిభూషణ్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ కూడా ఇంచుమించు లలిత్ కమిటీ లెక్కలనే ఖరారు చెయ్యబోతే, ఆ విషయం తెలిసి రీజినల్ కమిటీ చైర్మన్ జె.చొక్కారావు కొందరు తెలంగాణవాదులతో జస్టిస్ వశిష్ఠ భార్గవన్ కమిటీని కలిశారు. ఆ కలిసినవారు కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆనందరావు తోట, ఎ.సీతారాం రెడ్డి, ఉపేంద్ర లాల్ వ్యాఘ్రే, ఎల్.ఎన్.గుప్తా. వారు కొన్ని వివరాలతో లలిత్ కమిటీ లెక్కలు తక్కువగా ఉన్నాయని నిరూపించారు. దీంతో 1956 నవంబర్ 1 నుంచి 1968 మార్చి 31 దాకా ఉభయ ప్రాంతాలకు సంబంధించిన ఆదాయ- వ్యయాలను చూపే సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వం నుంచి భార్గవ్ కమిటీ తెప్పించుకుంది. వారి లెక్క ప్రకారం, అప్పటిదాకా తెలంగాణ నిధుల్లోంచి రూ.45 కోట్లు మాత్రం ఆంధ్రకు తరలించినట్టు భార్గవ కమిటీ తేల్చింది. నిజానికి తెలంగాణ నాయకుల లెక్కల ప్రకారం అది కూడా తరలించిన దానిలో చాలా తక్కువగా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆ నివేదికను ఆమోదించి, ఆ రూ.45 కోట్లు తెలంగాణకు తిరిగి ఇవ్వాలని, ఇక మీదట ఏ ప్రాంత ఆదాయం ఆ ప్రాంత అభివృద్ధికే ఖర్చుచేయాలని ఆంధ్ర నాయకులకు చెప్పింది. వారు తలలూపారు.
పాపం ప్రధానికేం తెలుసు, ఆంధ్ర రాజకీయ నాయకుల మాటలకు, నిజంగా వారు చేసే చర్యలకు, వారు చేసిన ప్రమాణాలకు సంబంధం ఉండదని! వారే చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్న మనుషులై పెద్ద మనుషుల ఒప్పందంలో చెప్పినవన్నీ తమ పాలనలో పాటించి ఉంటే, రాష్ట్రంలో ఒక ప్రాంతంలో నిరసనలు, ఉద్యమాలు జరిగేవి కావు, రెండు ప్రాంతాల మధ్య శతృత్వం పెరిగేది కాదు. కానీ, వారు ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకులు: వారికి ప్రజా క్షేమం, అభివృద్ధి కంటే స్వలాభం, వారి కుటుంబ అభివృద్ధి ముఖ్యం. అధికారం ద్వారా ఆదాయం, ఆ ఆదాయం ద్వా రా అధికారం! ఇప్పటిదాకా అదే నడుస్తున్నది.
ఈ రకంగా గట్టి ఛానెల్స్‌ను ఏర్పాటుచేసుకొని తెలంగాణ నీళ్లు, నిధులు నిరాటంకంగా ఆంధ్రకు పారేలా చేశారు ఆంధ్ర నాయకులు. కమిటీలు, అష్ట సూత్రాలన్నీ వ్యర్థ ప్రయత్నాలయ్యాయి. జన్‌సంఘ్ పార్టీలో ఉన్న నిజాయతీపరుడైన వాజపేయి ఈ సమస్యకు రెండవ ఎస్ఆర్సీ వేయాలని తెలంగాణ ప్రాంతం వారి అభిమతానికి, ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా ఎస్ఆర్సీ నిర్ణయించాలనీ సూచించారు. తెలంగాణ ప్రాంతమంతా యథావిధిగా ఊరేగింపులు, రోడ్లపై నిరసనలు, పోలీసుల దాష్టీకం, బాష్పవాయువు ప్రయోగాలు, గాల్లోకి కాల్పులు, కొన్ని సందర్భాల్లో మనుషుల మీదే కాల్పులతో వాతావరణం సామాన్య మానవులకు భీతావహంగా తయారైంది. ఆంధ్ర వారు మాత్రం కొన్నిచోట్ల తెలంగాణ వారి మీద దాడులు చేశారు. ఆంధ్ర జైలు అధికారుల సహాయంతో చంచల్‌గూడ జైల్లో ఆంధ్ర ఖైదీలు తెలంగాణ ఖైదీలపై దాడి చేశారు. ఆ దాడిలో 52 మంది ఖైదీలు, అందరూ తెలంగాణవారు తీవ్రంగా గాయపడ్డారు.
ఆ కాలమంతా, 1964 ఫిబ్రవరి నుంచి 1971 సెప్టెంబర్ దాకా అత్యంత కర్కోటకుడు కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కొన్ని చోట్ల పోలీసుల కాల్పుల్లో చనిపోయిన యువకుల శరీరాలు కూడా కుటుంబీకులకు ఇవ్వకుండా పోలీసులే రహస్యంగా ఖననం చేశారు. ఈయన కాలంలో ఇక్కడి ఆంధ్ర వారు చాలరన్నట్టు కర్నూలు, గుంటూరు నుంచి పెద్ద ఎత్తున రౌడీలను, గూండాలను జంట నగరాలకు తెప్పించారు స్వయంగా బ్రహ్మానందరెడ్డి. వీరంతా సామాన్యజనాల్లో కలిసిపోయి, గృహ దహనాలకు, లూటీలకు, విధ్వంసానికి దిగేవారు. దాదాపు 35 చోట్ల దహనకాండకు పాల్పడ్డారు. వారి చర్యలు ఆందోళనకారులకు ఆపాదించి, తెలంగాణ యువతను జైళ్లల్లో పెట్టేవారు పోలీసులు. యథేచ్ఛగా పోలీసులు జరిపిన కాల్పుల్లో చాలామంది తెలంగాణవారు మరణించారు. ఆంధ్ర గూండాలు బస్తీల్లో గుడిసెలను తగులబెట్టారు. పోలీసులు కూడా విచ్చలవిడిగా కాల్పులు జరిపి పసిపిల్లలను, యువకులను చంపారు. అది భరించలేక ఉద్యమ నాయకులు కుటుంబాల్లో స్త్రీలు, బాలికలు కూడా రోడ్ల మీదకు వచ్చి ఆందోళన సాగించారు. 1969 ఏప్రిల్ 4న సికింద్రాబాద్, ప్యారడైజ్ రోడ్డులో ఊరేగింపు తీస్తున్న విద్యార్థుల మీద హఠాత్తుగా పోలీసులు కాల్పులు జరపడంతో 369 మంది విద్యార్థులు చనిపోయారు. అందులో చాలామంది ఉన్నత విద్యనభ్యసిస్తున్న యూనివర్సిటీ విద్యార్థులే. దాన్ని తెలంగాణ ప్రజలు మార్టిర్స్ డేగా జరుపుతారు. ఆగస్టు నాటికి ఈ ఉద్యమం గురించి దేశమంతా చర్చించుకునే స్థితికి వచ్చింది.
ప్రధాని ప్రత్యేక రాష్ట్రం కుదరదని చెప్పటం, పాకిస్థాన్‌తో యుద్ధం జరిగే అవకాశం ఉండటం, తెలంగాణలో విద్యార్థులు ఒక విద్యాసంవత్సరాన్ని కోల్పోవటంతో ఉద్యమానికి తాత్కాలిక విరమణ జరిగింది. దానికంటే భీతావహ అంశం పోలీసులు ప్రతి చిన్న నిరసనకు కాల్పులు జరపడం, అప్పటిదాకా వందల మంది విద్యార్థుల మరణంతో కూడా విచలితులైన ఉద్యమ నాయకులు కూడా ఈ ప్రాంతానికి కొంత శాంతి కావాలని ఉద్యమాన్ని విరమించారు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజలకు కొంత స్వాంతన కోసం తెలంగాణ వాసిని ముఖ్యమంత్రిగా చేయాలని నిర్ణయించింది. 1971 సెప్టెంబర్ 30న పీవీ నరసింహారావును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.
మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీ పట్ల, అధినాయకుల పట్ల ఎంతో విధేయతతో ఉన్న పీవీ నరసింహారావును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేసేముందు ఇందిరాగాంధీ ఒక పనిచేసింది. మొదటినుంచీ తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల మధ్య ఉన్న సమస్య నదీజలాలతో ముడిపడి ఉన్నది. తెలంగాణ ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రంలో మూతపడ్డాయి.
అందుకే అప్పటి మూడు రాష్ర్టాలలో ప్రవహించే కృష్ణా నదీ జలాల పంపకం సరిగ్గా జరగాలని ప్రధాని 1970లో బచావత్ కమిషన్‌ను నియమించి, ఆయా రాష్ర్టాల నుంచి చీఫ్ ఇంజినీర్, మరొక సీనియర్ ఇంజినీర్, అడ్వకేట్ జనరల్, మరొక సీనియర్ న్యాయవాది కమిటీ ముందు హాజరై తమ రాష్ర్టానికి రావలసిన కృష్ణా జలాలతో వాటా గురించి తమ వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం నుంచి అప్పటి అడ్వకేట్ జనరల్ శ్రీరామచంద్రారెడ్డి, ప్రభుత్వ న్యాయవాది దంటు వెంకటప్పయ్య శాస్త్రి ఆ కమిటీలో మన రాష్ట్ర వాటా గురించి వాదించారు. కమిషన్ అందరి వాదనలు విన్నాక, కమిషన్ సభ్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు అందరూ ఈ రాష్ర్టాలన్నింటిలో కృష్ణానదీ పరీవాహక ప్రాంతాలను, వారికి కేటాయించిన, అప్పటిదాకా వాడుకుంటున్న జలాలను పరిశీలించారు. తెలంగాణ బీడు భూములు చూసి డీవీ శాస్త్రి (మా నాన్న గారు) 1978లోనే ఒక మాటన్నారు. ‘ఒకవేళ ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోతే అది నదీ జలాలలో పంపకం, వాడకంలో జరిగిన అన్యాయం వల్ల మాత్రమే’ అని! ఎందుకంటే మహబూబ్‌నగర్‌లో 140 కిలో మీటర్లు పారే కృష్ణా నదీ జలాల్లో ఆ జిల్లాకు 110 టీఎంసీల వాటా ఉండగా, ఆంధ్రా నాయకులు ఏనాడూ ఆ జిల్లాను 10 టీఎంసీల నీరు మించి వాడుకోనీయలేదు.
కానీ, ఆ తర్వాత కూడా ఆంధ్ర నాయకుల అక్రమాలు కొనసాగాయి. తెలంగాణ ప్రాంతంలోని గోదావరీ, కృష్ణానదుల మీద ప్రాజెక్టులు కట్టకుండా ఆపి, పోతిరెడ్డిపాడు, ఇతర ప్రాజెక్టులను రాయలసీమలో నిర్మించారు. ఇక్కడి గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను నిర్వీర్యం చేసి, నదీజలాలు ఆంధ్ర ప్రాంతానికి పారే విధానాలను సాగించారు. ఇక తెలంగాణ రైతాంగానికి వస్తే వర్షం, పడితే బోరు నీళ్లు మాత్రమే గతి అయి, సాగు పూర్తిగా చతికిలబడింది. 1969 నుంచి 2014 దాకా సుమారు 35 వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వ్యవసాయానికి నీరు లేక, కరెంట్ లేక వారి స్థితి వర్ణనాతీతమైంది. చాలామంది వ్యవసాయం వదిలేసి కూలీలుగా వలసలుపోయారు. వారి పిల్లలు కూడా చదవటానికి డబ్బులేక చిన్నతనం నుంచీ దొరికిన పనిచేస్తూ, ఇళ్లల్లో పనిచేస్తూ.. ఆహ్లాదంగా గడపాల్సిన బాల్యాన్ని కోల్పోయారు. యువకులు బొంబాయి, దుబాయి వలసలుపోయారు. ఆ కుటుంబాల్లోని ఆడవారు అష్టకష్టాలపాలయ్యారు.
1970లో ఉద్యమం చల్లారాక ఆంధ్ర వారి వలసల తాకిడి ఎక్కువైంది. బడా వ్యాపారులే కాదు, రోజు కూలీ కోసం కూడా ఆంధ్ర, రాయలసీమ వారు తెలంగాణలోకి వచ్చారు. ఈ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే హైదరాబాద్ ఎవరిదీ? అని 2000 సంవత్సరంలో అడిగిన ఆంధ్ర వారు ప్రస్తుతం ‘హైదరాబాద్ నీ అయ్య జాగీరా?’ అని తెలంగాణవారిని నిలదీస్తున్నారు. మరి 550 ఏండ్లు ఉన్న వారి జాగీరా లేక నిన్న మొన్నటి వచ్చినవాడి అయ్య జాగీరా హైదరాబాద్? ఇంకొక తెలివి తక్కువ ప్రసంగం ఆంధ్రవారు చేసేది వింటే చాలా నవ్వొస్తుంది. వారి మీద జాలేస్తుంది. మేం వచ్చి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం అంటారు. వారికేమన్నా చరిత్ర అనే పదం అసలు తెలుసా? 400 సంవత్సరాల నుంచి హైదరాబాద్ ప్రపంచంలోని 5 సుందరనగరాల్లో ఒక్కటై ఉండగా, తమ ప్రాంతంలో మూడేండ్లల్లో ఒక్క భవనం కట్టడం చాతకాని శుంఠలు, వాళ్లొచ్చి బాగుచేశారా హైదరాబాద్‌ను? ఈ నగరం లాగా బాగు చేసే శక్తి, సంపద ఉంటే వారి రాజధాని 1953-1956 మధ్యే ఎందుకు నిర్మించుకోలేదు? హైదరాబాద్ బాగుంది, అన్ని హంగులున్నాయనే కదా, ఇక్కడికి వచ్చి తిష్ట వేసింది! మరి హైదరాబాద్ నిర్మించిన పోటుగాళ్లు 57 ఏండ్లలో వారి ప్రాంతంలో ఒక్క నగరాన్ని నిర్మించకుండా ఏం చేశారు? గాడిదలు కాశారా? గుడ్డి గుర్రానికి పళ్లు తోమారా?
-కనకదుర్గ దంటు
89772 43484