మూడేండ్ల ముప్పుతిప్పలు
ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలులో అనుసరిస్తున్న నాన్చివేత, దాటవేత, ఎగవేత, ఎదురుదాడి ధోరణి వల్ల రాష్ట్రంలోని సకల జనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతుల సమస్యలు 100 రోజుల్లో పరిష్కారిస్తామని భరోసా ఇచ్చి వెయ్యి రోజులు దాటినా అతీగతీ లేదు.
ఎల్ నినో పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రుద్దిన కరువుతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్నది. అన్నివర్గాల ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే రాష్ట్రంలో ఎల్ నినో మొదలైంది. అధికారంలోకి వచ్చి మూడేండ్లు పూర్తికావస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు కాలేదు. అనేక వర్గాలు గంపెడాశలతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువస్తే వారికి నమ్మకద్రోహమే మిగిలింది.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలులో అనుసరిస్తున్న నాన్చివేత, దాటవేత, ఎగవేత, ఎదురుదాడి ధోరణి వల్ల రాష్ట్రంలోని సకల జనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతుల సమస్యలు 100 రోజుల్లో పరిష్కారిస్తామని భరోసా ఇచ్చి వెయ్యి రోజులు దాటినా అతీగతీ లేదు. మహిళలకు ప్రతి నెలా రూ.2,500 భృతి ఇస్తామని చెప్పినా ఇప్పటికీ దాని ఊసే లేదు. అయినా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. ప్రతి మహిళకు బాకీపడిన రూ.90 వేలు వంతున కోటి మందికి ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
నిరుద్యోగులకు మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు కేవలం ఇచ్చింది కేవలం 16 వేలు మాత్రమే. కానీ పాలకులు చెప్తున్న ఉద్యోగాల భర్తీ లెక్కల్లో 50 వేలు కేసీఆర్ సర్కార్ పూర్తిచేసిన నియామక ప్రక్రియ ద్వారా వచ్చినవే. అధికారంలోకి వచ్చిన తొలి క్యాబినెట్లోనే మెగా డీఎస్సీ వేస్తామని చెప్పి మోసం చేశారు. నిరుద్యోగ భృతి జాడే లేదు. జాబ్ క్యాలెండర్ కానరాదు. యూత్ కమిషన్ ఏర్పాటు, ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్, రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పొరేషన్, స్టడీ సర్కిళ్ల ఏర్పాటు వంటి హామీలపై పాలకులు ఇప్పుడు ఒక్కమాట కూడా మాట్లాడటం లేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయండని నిరుద్యోగులు ఆందోళన చేస్తే తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తూ చిక్కడపల్లి లైబ్రరీ, అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌లను పోలీస్ కాన్సంట్రేషన్ క్యాంపులుగా మార్చారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేసిన నిరుద్యోగులను బీఆర్ఎస్ కార్యకర్తలుగా చిత్రీకరిస్తూ ప్రతిపక్షాల కుట్రగా ముద్ర వేసి ఎదురుదాడికి దిగుతున్నారు. రైతులకు దాదాపు 30 హామీలు ఇచ్చారు. రైతు భరోసా కింద యేటా రూ.15 వేలు చేస్తామని ఎకరానికి ఇస్తామని ప్రకటించి, దానిని రూ.12 వేలకు కుదించారు. మూడేండ్లలో ఆరుసార్లు ఇవ్వాల్సిన రైతు భరోసా మూడుసార్లు ఎగ్గొట్టి, మూడుసార్లు కోతలు పెట్టారు.
రుణమాఫీ రూ.2 లక్షలు అని చెప్పి కేవలం 60 శాతం రైతులకు మాత్రమే ఇచ్చారు. రూ.30 వేల కోట్లు మాఫీ అని ప్రచారం చేసి రూ.17 వేల కోట్లు అప్పు మాఫీ చేసి అంతా అయిపోయిందని చేతులు దులిపేసుకున్నారు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పి మూడేండ్లవుతున్నా కూలీల గుర్తింపు పూర్తికాలేదు. పది పంటలకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఒక్క సన్నవడ్లకు అందులో 7 రకాలకు మాత్రమే కుదించారు.
24 గంటల ఉచిత విద్యుత్తు అని ప్రకటించినా 8 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు. బొగ్గు సరఫరా చేయకపోవడం వలన విద్యుత్తు ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. ధరణి పోర్టల్ రద్దుచేసి తెచ్చిన భూ భారతి వలన రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదు. వేలాది ఎకరాలను 22-ఏ కింద పెట్టి వేధిస్తున్నారు. రైతులకు రూ.3 లక్షల వడ్డీ లేని రుణం, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని చెప్పినా పరిశీలన కాలేదు. ఎల్ నినో పేరు చెప్పి యాసంగిలో వరి సాగు, పంటల సాగు చేయొద్దని, ప్రభుత్వం భయపెడుతున్నది. సాగు నీటి కోసం ముందస్తు ప్రణాళికలు లేవు. గోదావరి, కృష్ణా జలాలు సముద్రంలోకి పోతున్నా ఎత్తిపోసుకొని రైతులకు ఇవ్వాలనే సోయి లేదు. ఆంధ్రలో జల హారతులు పడుతుంటే తెలంగాణలో రైతులకు ఉరితాడు బిగిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటైన పీఆర్సీ ఆరు నెలల్లో అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ కనీసం నివేదిక కూడా తెప్పించుకోలేదు. పీఆర్సీ గురించి అడిగితే దాటవేత ధోరణిని పాలకులు అవలంబిస్తున్నారు. మూడేండ్లుగా పీఆర్సీ గడువు పొడిగిస్తున్నారు. పీఆర్సీ నివేదికకు ఈ ఏడాది సెప్టెంబర్‌తో గడువు ముగిసినా రిపోర్ట్ గడప దాటలేదు. సీపీఎస్ రద్దుపై కమిటీ వేస్తామని కాలయాపన చేస్తున్నారు. పెండింగ్ డీఏలు విడుదల చేస్తామని చెప్పి 4 డీఏలు పెండింగ్ పెట్టారు. 2024 మార్చి నుంచి రిటైరైన ఉద్యోగులకు బకాయిలు చెల్లించకుండా వేధిస్తున్నారు. బకాయిలు చెల్లించాలని రిటైర్డ్ ఉద్యోగులు నిత్యం ఆందోళనలు చేస్తున్నారు. ఈ విషయంలో హైకోర్టు తీర్పును అమలు చేయకుండా నాన్చివేత ధోరణిని ప్రదర్శిస్తున్నారు.
ఇప్పటికే మానసిక ఒత్తిడి వల్ల వంద మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులు మరణించారు. అనేక దవాఖానల్లో వైద్యం అందించక పోవడంతో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. హెల్త్ కార్డులతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో వైద్య సేవలు అందిస్తామని అంటూ ఈ ఏడాది మే నెల జీతాల నుంచి నేటివరకు ఉద్యోగుల వేతనాల్లో 1.5% శాతం కోతలు విధిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాలకులకు ముందుచూపు కరువై రెవెన్యూ రాబడి తగ్గిపోయి ఆ పార్టీ నేతల జేబుల రాబడి పెరిగిపోయింది. హైడ్రా హంగామా వలన రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్నది. 22-ఏలో కోట్లాది ఎకరాలు నిషేధిత జాబితాలోకి చేర్చడం వలన రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోయింది.
టెండర్ల బిల్లుల చెల్లింపులో విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్నదని, కమీషన్ ఇవ్వకుండా ఏ పనీ జరగడంలేదని బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు ఒక ప్రముఖ బిల్డర్ లేఖ రాసినట్లు పత్రికల్లో వార్తలు రావడం గమనార్హం. ఎల్ నినో ఎదురుక్కోవడంలో విఫలమైన తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నది.
కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద గోదావరి నీటి ప్రవాహాన్ని బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ పరిశీలించి నీటిని ఎత్తిపోయాలని చెప్పినప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు. కృష్ణా నదిలో నీళ్లున్నా ఎత్తిపోయకుండా డ్రామాలు ఆడడంతో ప్రజలు, రైతులే స్వయంగా మోటర్లు ఆన్ చేసే ప్రయత్నం చేశారు. హరీశ్‌రావుతో పాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తేవడంతో పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లు కేవలం 8 గంటలు నడిపి ఆర్భాటం చేశారు.పంటలు వేయొద్దు అని చెప్పే ప్రభుత్వం రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇస్తుందో స్పష్టం చేయాలి. ప్రజలను, రైతులను ఎల్ నినో పేరిట నీటి పొదుపు, సాగు విస్తీర్ణం తగ్గించండి, నిర్మాణాలు వాయిదా వేయండి అని చెప్పిన పాలకులు భారత్ సమ్మిట్ పేరిట కోట్లాది రూపాయలు ప్రభుత్వ సొమ్ము వృథా చేయడం ఎంతవరకు సబబు. ఈ నేపథ్యంలో దగాపడిన అన్ని వర్గాలు ఆలోచించి త్వరలో జరిగే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సర్కార్‌కు తగిన గుణపాఠం చెప్పడం కర్తవ్యం కావాలి. ఎన్నికలు ఏవైనా ప్రజలు తమ ఓటును ఆయుధంగా ఉపయోగించుకుని పాలకపక్షానికి తగిన బుద్ధి చెప్పాలి.
(వ్యాసకర్త: బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్)
దేవీప్రసాద్
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మూడేండ్ల ముప్పుతిప్పలు
ఎయిర్టెల్ అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్
TTD | సెక్యూరిటీ ,విజిలెన్స్ గార్డు నియామక నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదు : టీటీడీ
YS Jagan | సమగ్రమైన కుల గణనకు వైసీపీ మద్దతు : వైఎస్ జగన్
Health tips | మీ రోజువారీ డైట్లో వెల్లిపాయలుంటే కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

