తెలంగాణ యువ కిరణం కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ పండుగ చేసుకుంటున్నది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ వెంట నడిచి ఉద్యమంలో మమేకమైనవాడు కేటీఆర్.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో చోటు సంపాదించుకుని తనకున్న మేధస్సుతో రాష్ట్ర అభివృద్ధికోసం ఎనలేని కృషి చేస్తున్న యువ నాయకులు కేటీఆర్.
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా రాష్ర్టానికి పెట్టుబడులు తీసుకురావడంలో ఆయన కృషి అనిర్వచనీయం. తనకున్న విషయ పరిజ్ఞానంతో తెలంగాణ ఐటీ రంగాన్ని పరుగులు పెట్టించారు. ఐటీ రంగంలో సమూల మార్పులు తీసుకువచ్చి కోట్లాది పెట్టుబడులు తెలంగాణకు తీసుకురావడంలో ఆయన కృషి వెలకట్టలేనిది. తెలంగాణ సంక్షేమంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకశాలపై ప్రత్యేక దృష్టి సారించారాయన. ఐటీ రంగంలో ఆయన సాధించిన విజయాలతో ప్రపంచ దేశాల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి.
కేటీఆర్ అంటేనే పేద ప్రజానీకానికి ఒక భరోసా. ఆపద సమయంలో ‘అన్నా’ అంటే స్పందించే మంచి మనస్సున్న నాయకుడు. ఐటీ, పురపాలక శాఖ మంత్రిగా పరిపాలనలో సమర్థవంతంగా,
మున్సిపాలిటీలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ మున్సిపల్ శాఖలో అనేక మార్పులు తీసుకు వచ్చారు. ఐటీ శాఖకు విదేశీ పెట్టుబడులను తీసుకురావడంలో ఆయనను మించినవారు లేరు. ఐటీహబ్ ద్వారా యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీస్తూ వారికి ఐటీ రంగంలో సముచిత స్థానం కల్పిస్తున్నారు.
తండ్రికి తగ్గ తనయుడిగా అధిష్ఠానం ఏ బాధ్యతలు అప్పగించినా వాటిని విజయవంతంగా పూర్తి చేసి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంలో ఆయనకు ఆయనే సాటి. ఉద్యమం నుంచి నేటి వరకు ప్రజల మధ్య ఉండి ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న నాయకుడు కేటీఆర్.
మిద్దె సురేష్
97012 09355