ఎక్కడిదీ రాజకీయం
ఎక్కడిదీ హింసాకండ కావరం
ఎక్కడిదీ మృగరాక్షసం
ఎక్కడినుంచి వచ్చిపడిందీ దేశంలో
నగ్నమైన దేహానికి ఊరేగింపులేంది
మెడపై తలలు కొయ్యలకు వేలాడుడేంది
అస్పష్టంగా ఉన్న అల్లర్ల వెనుక
సుస్పష్టమైన సత్యం ఏమిటి ?
హృదయాలు గగ్గోలు పెడుతున్నాయి
ఉదయాలు ఎరుపెక్కిపోతున్నాయి
శోకతప్త గొంతులు అలసిపోతున్నాయి
పిడికిలెత్తిన చేతులు న్యాయం దొరకక
వాలిపోతున్నాయి..
ఇదేనా వెలిగిపోతున్న భారత్..?
ఏ పాలకుడి నాటకం ఇది
ఏ నాయకుడి వికృతం ఇది
ఏ దుర్మార్గుడి రాజనీతి ఇది
విధి విధ్వంసం సృష్టిస్తుంటే
విశ్వగురు మౌనం దేనికి?
నీ ముఖౌటం ముభావంగా
నీ నిజరూపం వికటాట్టహాసంగానా?
మళ్లీ.. రెజ్లర్లకు దక్కిన దమననీతే
నగ్న గాయాలకు కూడానా..
ఎన్నాళ్లూ ఈ దౌర్భాగ్యం..?
ఎన్నేళ్లు ఈ ‘మణి’పూర్కు
మరణ శాసనం
– శ్రీపాద రమణ