ప్రతిభ ఒకరి సొత్తు కాదు. ప్రతిభను నిరూపించుకోవడానికి ఒక సందర్భం అవసరం. కానీ కుల, మత, వర్ణ, లింగ వివక్షలు అడ్డురావని నిరూపితమవుతున్న కాలమిది. ప్రతి విజయం వెనుక స్త్రీల పాత్ర ఉంటుందనేది చారిత్రక సత్యమైనప్పటికీ, వారు ముందుండి పోరాడితే దేన్నయినా సాధించగలరనడానికి వారు సాధిస్తున్న విజయాలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
ఆడపిల్ల పెళ్లి మాత్రమే కాదు ఆ బిడ్డ కాన్పు కష్టాన్ని కూడా ప్రభుత్వం పంచుకున్నది. కేసీఆర్ కిట్ రూపంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించే ప్రతి ఆడబిడ్డకు డెలివరీ చేసి ఆడపిల్ల పుడితే 13వేలు,మగ పిల్లవాడు పుడితే 12వేలు వారి అకౌంట్లలో వేస్తున్నది. తల్లీబిడ్డకు కావాల్సిన ఉపకరణాలు ఇచ్చి ప్రభుత్వ వాహనంలో క్షేమం గా ఇంటి దగ్గర దించి వస్తున్నది. కేసీఆర్ కిట్ వల్ల 2014 కు ముందు రెండంకెల సంఖ్యను కూడా దాటని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు ఇవ్వాళ ఒక్కో ఆసుపత్రిలో 300 నుండి 400 వరకు పెరిగాయి.
నేడు అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకొని ప్రతి రంగంలో మహి ళా శక్తి అజేయంగా నిలుస్తున్నది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో సైతం లాఠీలకు, రబ్బరు బుల్లెట్లకు వెరవని ధైర్యం, తమ ప్రాణార్పణతో ఉద్యమ జ్యోతిని వెలిగించిన త్యాగం తెలంగాణ మహిళలది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి గ్రామంలో ఉండే ఉన్నతపాఠశాల దాకా తెలంగాణ విద్యార్థినీ లోకం ఒక్కటై తెలంగాణ కోసం కొట్లాడింది. బతుకమ్మ ఆట మొదలు వంటావార్పు దాకా ప్రతి సందర్భంలో తమ ఆకాంక్షను చాటింది. తెలంగాణ పోరాటంలో విజయం సాధించడంతోపాటు ప్రభుత్వంలో నూ విజయవంతమైన పాత్రను పోషిస్తున్నది మహిళాశక్తి. స్థానిక సంస్థలన్నింటిలో 50% కంటే ఎక్కువ పదవుల్లో మహిళలు ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో అత్యంత క్రియాశీల పాత్రను నిర్వహిస్తున్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా మార్కెట్ కమిటీల్లో కూడా కేసీఆర్ రిజర్వేషన్లు అమలు చేసి మహిళలకు అవకాశం కల్పించడంతో ఇవ్వాళ తెలంగాణ అంతటా మహిళలు తమవంతు పాత్రను నిర్వర్తిస్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలో మహిళలకు గౌరవప్రదమైన స్థానాల్ని అందించి ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం.
తెలంగాణ రాకముందు మహిళలు తాగునీటి కోసం పడ్డ గోస వర్ణనాతీతం. కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు తీసుకురాలేక అలసిపోయిన దైన్యం తెలంగాణ మహిళలది.కానీ తెలంగాణా వచ్చిన వెంటనే తెలంగాణ మహిళల తాగునీటి కష్టాల్ని తీర్చేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టారు సీఎం కేసీఆర్. తద్వారా మారుమూల తండా, గూడెం నుంచి మహానగరంలో అన్ని గ్రామాలు, పట్టణాల్లో స్వచ్ఛమైన గోదావరి, కృష్ణా జలాలను ఇంటింటికీ నల్లాద్వారా అందిస్తున్న గొప్ప మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్.
తెలంగాణలో అమలవుతున్న పథకాలు కేవ లం ఆర్థిక ప్రయోజనాల కేంద్రంగానే కాదు వాటివెనుక నిగూఢమైన సామాజిక దృక్పథం దాగి ఉంటుంది.సమాజంలోని అనేక రుగ్మతలను రూపుమాపే దిశగా ఆ పథకాల ప్రయాణం విజయవంతంగా ముందుకు సాగుతోంది. తెలంగా ణ ఉద్యమ సమయంలో సర్వస్వం అగ్నిప్రమాదంలో కోల్పోయిన గిరిజన కుటుంబం పెండ్లికి పడుతున్న కష్టం కళ్లారా చూసిన కేసీఆర్ మదిలో కల్యాణలక్ష్మి పథకం రూపుదిద్దుకుంది. కల్యాణలక్ష్మి ఇవ్వాళ ఆడపిల్ల తల్లితండ్రులకు ఒక గొప్ప భరోసా. ఒక్క కల్యాణలక్ష్మి మాత్రమే కాదు కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు సమాజంలో గొప్ప విలువల్ని, బంధాలను కాపాడుతున్నాయి.
ఇవ్వాళ తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లల చదువును ప్రోత్సహిస్తూ బాలికల గురుకులాలను విస్తృతంగా ఏర్పాటు చేయడం,ప్రభుత్వ విద్య ను అన్ని స్థాయిల్లో అందుబాటులో ఉంచడం వల్ల తెలంగాణ బాలికలు తమ ప్రతిభను చాటి ఉన్నతంగా కీర్తించబడుతున్నారు.అంగన్వాడీల నుంచి పాఠశాలలు,కళాశాలల్లో చదివే విద్యార్థినులకు బలమైన పౌష్టిక ఆహారం, హెల్త్ అండ్ హైజీన్ కిట్లను కూడా అందిస్తున్నారు. బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను ప్రతి నియోజకవర్గంలో అందుబాటులోకి తేవడం వ ల్ల గ్రామీణ ప్రాంతాల్లో విద్యకు దూరంగా ఉన్న పేద కుటుంబాల పిల్లలు తమ ప్రతిభను చాటుకునే అవకాశం లభిస్తున్నది. ఎక్కడో మారుమూల గూడెంలోని మలావత్ పూర్ణ ఎవరెస్ట్ శిఖరం మీద తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగురవేసే ధైర్యాన్ని, విశ్వాసాన్ని తెలంగాణ ప్రభుత్వం నింపగలిగింది.
ఆడపిల్ల పెళ్లి మాత్రమే కాదు ఆ బిడ్డ కాన్పు కష్టాన్ని కూడా ప్రభుత్వం పంచుకున్నది. కేసీఆర్ కిట్ రూపంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించే ప్రతి ఆడబిడ్డకు డెలివరీ చేసి ఆడపిల్ల పుడితే 13వేలు,మగ పిల్లవాడు పుడితే 12వేలు వారి అకౌంట్లలో వేస్తున్నది. తల్లీబిడ్డకు కావాల్సిన ఉపకరణాలు ఇచ్చి ప్రభుత్వ వాహనంలో క్షేమం గా ఇంటి దగ్గర దించి వస్తున్నది. కేసీఆర్ కిట్ వల్ల 2014 కు ముందు రెండంకెల సంఖ్యను కూడా దాటని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు ఇవ్వాళ ఒక్కో ఆసుపత్రిలో 300 నుండి 400 వరకు పెరిగాయి.
విధి వక్రించి భర్తలకు దూరమై తమ కుటుంబాల పోషణా బాధ్యతల్ని మోస్తున్న తల్లుల కుటుంబాలకు ఆసరా నిచ్చింది కేసీఆర్ ప్రభు త్వం. వారందరికీ నెలనెలా వారి అకౌంట్లలో రూ. 2016 పింఛన్ ఇస్తున్నది. తద్వారా వితంతువులు, ఒంటరి మహిళలు మరొకరికి భారం కాకుండా కుటుంబంలో,సమాజంలో ఆత్మగౌరవంతో జీవించేలా చేసింది. సమైక్య రాష్ట్రంలో బతుకు మీద ఆశ కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి కనీసం ఏ ప్రభుత్వం అండగా నిలువలేదు. ఈ రోజు దురదృష్టవశాత్తు రైతు ఏ కారణం చేతనైనా మరణిస్తే ఆ కుటుంబానికి స్వాంతన చేకూర్చాలని రైతు మరణించిన పది రోజుల్లోపు వారి కుటుంబసభ్యుల అకౌంట్లలో రూ. 5 లక్షలు వేసి అండగా నిలుస్తున్నది కేసీఆర్ సర్కారు. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తూ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు విశేషంగా కృషి చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. వడ్డీ లేని రుణాలను 10 లక్షల వరకు అందిస్తూ, గ్రామాల్లో చిన్న చిన్న వ్యాపారాలు కుటీర పరిశ్రమల ఏర్పాటుకు స్త్రీనిధి ద్వారా నిధులు సమకూరుస్తున్నది. దానిద్వారా ఆర్థికంగా మహిళలు తమ కాళ్ళమీద తాము నిలబడేందుకు సంపూర్ణ సహకారం అందిస్తున్నది ప్రభుత్వం. ప్రభుత్వం. T-hub, TS IPASS లలో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చి వారి ప్రతిభను ప్రపంచానికి చాటే ఆవకాశం కల్పించింది కేసీఆర్ ప్రభుత్వం.
తెలంగాణలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, దాడులకు అడ్డుకట్ట వేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎంతో స్ఫూర్తిదాయకం. ఒకవైపు పోలీస్ వ్యవస్థను పటిష్టం చేస్తూ మరోవైపు ప్రజలతో ఫ్రెండ్లీగా సేవలందించే విధంగా, మానవీయ విలువల్ని పెంపొందించే విధంగా తీర్చిదిద్దారు. ప్రత్యేకించి మహిళల రక్షణకు షీ టీంలను ఏర్పాటు చేసి ఆకతాయిలపై నిఘా పెడుతూ మహిళలను కంటికి రెప్పలా కాపాడుతుంది ప్రభుత్వం.
తెలంగాణలోని మహిళల కష్టాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోయి రాజకీయంగా,ఆర్థికంగా ,సామాజికంగా తమ ప్రతిభాపాటవాలు నిరూపించుకునే అవకాశం,వెసులుబాటు తెలంగాణలో దొరికింది. కేసీఆర్ ఎంతో ముందుచూపుతో, కమిట్మెంట్తో రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు తెలంగాణ అభివృద్ధి ఫలాలను అందించాలని అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో మహిళల అభివృద్ధికి బలమైన పునాది పడిందనడంలో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణ అన్ని రంగాల్లో దేశంతో పోటీపడుతూ అగ్రగామిగా నిలుస్తుంది.
మహిళల ఆర్థిక,రాజకీయ, సామాజిక ,రక్షణ విషయాల్లో తమదైన ముద్రను వేసుకొంటూ ఎటువంటి అసమానతలు,అవమానాలు,వివక్షలేని,సమానత్వం మూర్తీభవించిన తెలంగాణకోసం కేసీఆర్ నాయకత్వాన్ని నిండైన మనసుతో దీవించి భారతదేశ గతిని మార్చే సంకల్పాన్ని బలపరుద్దాం…
(వ్యాసకర్త : అధ్యక్షురాలు, గజ్వేల్ మార్కెట్ కమిటీ)
-మాదాసు అన్నపూర్ణ