రాజ్యాంగ సంక్షోభం రానున్నదా?
దేశంలో ప్రస్తుతం ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఎమర్జెన్సీ విధించడానికి ముందు ఉన్నటువంటి పరిస్థితులను పోలికలు పోలి పరిణామాలు ఉన్నట్టు కనిపిస్తున్నది. అయినప్పటికీ పరిస్థితిని చక్కదిద్దేందుకు సమయం మించిపోలేదు. భారత్‌లో ప్రజాస్వామ్యం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. విద్యావ్యవస్థపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి.
దేశంలో ప్రస్తుతం ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఎమర్జెన్సీ విధించడానికి ముందు ఉన్నటువంటి పరిస్థితులను పోలికలు పోలి పరిణామాలు ఉన్నట్టు కనిపిస్తున్నది. అయినప్పటికీ పరిస్థితిని చక్కదిద్దేందుకు సమయం మించిపోలేదు. భారత్‌లో ప్రజాస్వామ్యం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. విద్యావ్యవస్థపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. పోలీసుల అణచివేత, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చూశాం. ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు సమీపంలో ఆందోళనలు జరిగాయి.
డబుల్ ఇంజిన్ సర్కార్ నమూనా అనేది బ్రిటిష్ పాలనలో రూపొందించిన 1935 చట్టానికి పెద్దగా భిన్నంగా ఏమీ లేదు. అది ప్రజాస్వామ్య సమాఖ్య వ్యవస్థకు ప్రత్యామ్నాయం కాలేదు. ఈ విధంగా, పార్లమెంటులోని ఉభయ సభలూ పార్లమెంటు సార్వభౌమాధికారం అనే భావనను ప్ర జల అంగీకరించలేకపోతున్నారు. అవసరమైన సవరణల ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపే తం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.
కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉద్యమాలు ఉవ్వెత్తున జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యం 70వ దశకంలో పరిస్థితులకు పెద్దగా భిన్నంగా ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు ఒక కొత్త పార్టీ ఆధిపత్యం చెలాయిస్తున్నది. గతంలో నిర్మించిన సంస్థలు బలహీనపడటం వల్ల అరాచకం స్థాయి మరింత పెరిగిందని చెప్పవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన ఎన్నికల సంఘం సహా పలు సంస్థలకు వ్యతిరేకంగా భారీ నిరసనలు జరుగుతున్నాయి. పార్లమెంటు, అందులోని రాజకీయ పార్టీలు విభిన్న వర్గాల ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించలేకపోతున్నాయి. ఏడాదిగా మణిపూర్ అల్లకల్లోలంగా మారింది. పార్లమెంటు సమావేశాల్లో కూడా ప్రభుత్వం ఆ విషాదాన్ని పట్టించుకోవడంలేదు.
ఇందిర అంటే ఇండియా అనే రాజకీయ వాతావరణంలో ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీకి ముందు నాటి పరిస్థితులను గుర్తుచేసేలా కొన్ని ఆందోళనకరమైన ధోరణులు కనబడుతున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. ఉదాహరణకు, ఒకే పార్టీ ఆధిపత్యం బలంగా కొనసాగుతున్న నేపథ్యంలో, దానికి వ్యతిరేకంగా దేశంలో ప్రజా నిరసనలు ఏకకాలంలో జరుగుతున్నాయి. అదే సమయంలో, ఆపరేషన్ సిందూర్‌లో సైనిక విజయాన్ని అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నది. అధికారంలో ఉన్న నాయకత్వం తన ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్నది. 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం తర్వాతా ఇలాంటి చర్యలే ఉన్నాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, జేపీ నాయకత్వంలోని ఉద్యమం, దేశవ్యాప్త ఎమర్జెన్సీ ప్రకటన ఇవన్నీ చరిత్ర.
నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారనే కేసులో ఆమెకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెలువరించడమే ఎమర్జెన్సీకి తక్షణ కారణంగా నిలిచింది. ఇప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి.
ఈ అంశంపై న్యాయస్థానం తీర్పు వెలువడాల్సి ఉన్నది. ఇక నిరసనలు తెలుపుతున్న యువతను దేశద్రోహులు, విదేశీ నిధులతో ప్రేరేపితమయ్యారు అంటూ ఆరోపణలు, నిరసనకారులపై బలప్రయోగం ఆందోళన కలిగిస్తున్నాయి. నిరసనల అణచివేత కోసం పెల్లెట్ గన్స్ వినియోగించడం, విచారణ లేకుండానే నిర్బంధంలో ఉంచడం, నిరసన ప్రదర్శనలకు అనుమతించిన ప్రదేశాలను కూడా రద్దు చేయడం వంటి చర్యలను గమనిస్తున్నాం. గత ఎమర్జెన్సీ సమయంలో జరిగిన ఎన్కౌంటర్ మరణాల స్థాయికి ఇంకా చేరుకోలేదు. అయినప్పటికీ, సంపూర్ణ అధికారం అవినీతికి దారితీసే స్వభావం మరోసారి రాజ్యాంగపరమైన సంక్షోభానికి దారితీయవచ్చనే ఆందోళనను కలిగిస్తున్నది.
దేశంల ప్రస్తుతం చాలా ప్రజాస్వామ్య సంస్థలు దెబ్బతిన్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అరాచకం గురించి ఆందోళన చెందాల్సి వస్తే, మొదటగా చెప్పుకోవాల్సింది పార్లమెంటే. రాజ్యసభలో 31 శాతం మంది, లోక్‌సభలో సంఖ్య 46 శాతం మంది సభ్యులు నేరచరిత్ర కలగిన వారు ఉన్నారు. వీరిలో చాలామంది తమ పార్టీలకు విధేయులుగా వ్యవహరిస్తున్నారు. పార్లమెంటు సమావేశాల్లో ఉత్సాహంలేని చర్చలు, గందరగోళం మధ్య ఎంపీల పనితీరు ఎక్కువగా మరుగున పడిపోతున్నది. అటువంటి సమావేశాల్లో పలు బిల్లులను ప్రవేశపెడుతున్నారు. ఎక్కువ భాగం వాయిస్ ఓటింగ్ ద్వారా ఆమోదం పొందుతున్నాయి. సభాపతి మాటే ప్రముఖంగా వినిపిస్తున్నది. ప్రభుత్వం భారీ ఖర్చుతో హాస్యాస్పద నాటకం టీవీ తెరల ద్వారా, సెల్ ఫోన్ పరికరాల ద్వారా ప్రజలకు ప్రత్యక్ష ప్రసారమవుతున్నది.
ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు గతంలో జరిగిన సమావేశాలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. నెహ్రూ సహా అప్పటి ప్రధానమంత్రులు క్రమం తప్పకుండా పార్లమెంటుకు హాజరయ్యేవారు. బిల్లులను స్వయంగా ప్రవేశపెట్టి, స్ఫూర్తిదాయకమైన చర్చలకు నాయకత్వం వహించేవారు. ఆ చర్చల ప్రతిధ్వనులు ఇప్పటికీ విద్యాసంస్థల్లో నిర్వహించే నమూనా పార్లమెంటు సమావేశాల్లో వినిపిస్తుంటాయి. ప్రస్తుతం ప్రసారమవుతున్న మన్ కీ బాత్ కార్యక్రమం అనేక విషయాలపై అవగాహన కల్పించేదే. కానీ పార్లమెంటును పక్కనపెట్టి, రేడియో కార్యక్రమం నిర్వహించే నాయకుడినే అది ప్రజల ముందుకు తీసుకువస్తున్నది.
భారత రాజ్యాంగంలో సమాఖ్య వ్యవస్థకు సంబంధించిన నిర్మాణం లోపించింది. సమాఖ్యలోని వివిధ రాష్ర్టాల మధ్య, అలాగే రాష్ర్టాలకు, కేంద్రానికి మధ్య అధికారాలను సంస్థాగతంగా సమానంగా పంపిణీ చేసే విధానం దానిలో లేదు. ఇది శక్తిమంతమైన అమెరికా సెనేట్‌కు భిన్నమైనది. అమెరికా సెనేట్‌లో ప్రతి రాష్ర్టానికీ సమాన ప్రాతినిధ్యం ఉంటుంది. దీంతో ఎక్కువ జనాభా కలిగిన రాష్ర్టాలకు కేంద్ర శాసనసభలో ఎక్కువ ప్రాతినిధ్యం ఉంటుంది. ఫలితంగా లభించే సంఖ్యాపరమైన ఆధిక్యం సమతుల్యమవుతుంది.
డబుల్ ఇంజిన్ సర్కార్ నమూనా అనేది బ్రిటిష్ పాలనలో రూపొందించిన 1935 చట్టానికి పెద్దగా భిన్నంగా ఏమీ లేదు. అది ప్రజాస్వామ్య సమాఖ్య వ్యవస్థకు ప్రత్యామ్నాయం కాలేదు. ఈ విధంగా, పార్లమెంటులోని ఉభయ సభలూ పార్లమెంటు సార్వభౌమాధికారం అనే భావనను ప్ర జల అంగీకరించలేకపోతున్నారు. అవసరమైన సవరణల ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపే తం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా దేశంలో రాజ్యాంగ సంస్థల సంక్షోభం, పార్లమెంటులో ప్రహసనాలు, ప్రజా ఉద్యమాలు చూస్తుం టే ఎమర్జెన్సీకి ముందటి పరిస్థితులను తలపిస్తున్నాయి. ఈ దశ మరో రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందా అనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
(వ్యాసకర్త: జేఎన్‌యూ పూర్వ ప్రొఫెసర్)
(‘ది వైర్’ సౌజన్యంతో)
అశ్విని కె.రే
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

