స్త్రీ కి మొదటి పేరు మహిళ. మహిళ అంటే మహాశక్తిశాలిని అని అర్థం. మనదేశంలో స్త్రీ మూర్తి శక్తి గా పిలువబడింది. జగత్తును జగన్మాతగా, వేదాన్ని వేదమాతగా, భూమిని భూమాతగా, గోవును గోమాతగా, నీటిని గంగా మాతగా పిలువబడే మాతృరూపి సమాజం మనది. ఈ సృష్టినంతా మాతృరూపంగా భావిస్తాం. ఈ మాతృభావన కుటుంబ వ్యవస్థకు మూలాధారం అయింది.
‘సురీయోదేవి, యుషసగుశీ యోచమానా మరీయ వయోషా యబ్యేతు పశ్చాత్.’ఇది కృష్ణయజుర్వేదములోని మంత్రం. లోకం లో మనిషి స్త్రీ ననుసరించి ఎలా నడుస్తున్నాడో సూర్యుడు కూడా ఉషాదేవిననుసరించి నడుస్తు న్నాడని ఈ మంత్రానికి అర్థం. వేదకాలంలో స్త్రీకి సంపూర్ణ స్వాతంత్య్రం ఉండేది. మహాయోధులైన స్త్రీలు ఆ కాలంలో ఉన్నారు. రుగ్వేదకాలంలో అ నేక మంత్రాల్ని మహిళలే దర్శించినట్లు అంతర్గ త సాక్ష్యాలున్నాయి. బ్రహ్మ వాదిని గార్గి, శ్రేయో మార్గంలో మైత్రేయి, ప్రేయోమార్గంలో కాత్యా యనిలాంటి ఎందరెందరో వేదకాలంలో దార్శని కులయిన మేధావినులు, విద్య, వైద్యం, వ్యవ సాయం, సాహిత్యం, కళలు, వివిధ వృత్తులు, రాజనీతి మొదలగు అనేక రంగాల్లో ప్రతిభా వం తులుగా వెలుగుతూ మహిళా వికాసం సమగ్రం గా జరిగిన కాలమది.
శచీదేవి, వేదవతి, వరూధిని,అరుంధతి లాం టి అనేకానేక దివ్యశక్తులు ఉన్న మహిళలెందరో వారిజీవితాలు, ప్రవర్తనలు భారతీయ మహిళల కు ఆదర్శాలై, ఆచరణ యోగ్యమయ్యాయి. రా మాయణ మహాకావ్యం నిండా మహిళల కథలే. అందుకే దీన్ని సీతాచరిత్ర అని కూడా అన్నారు. మహిళలపై దౌర్జన్యం జరిపిన రావణాదులున్నా రు. మహిళలను రక్షించిన రామాదులు ఉన్నారు. ఈ మహేతిహాసంలో ఉన్న మహిళలందరిలో ప్రత్యేక వ్యక్తిత్వాలు కనిపిస్తాయి.
ఇల్లాలు లేని ఇల్లు అడవితో సమానం అం టుంది మహాభారతం. శిల్పం వంటిది స్త్రీ మూర్తి అంటాడు హారియర్ అనే ఆంగ్లమేధావి. ప్రత్యక్షంగా కనిపించకపోయినా విలువలతో కూడిన వ్యవస్థ రూపుదిద్దుకోవడానికి మహిళల పాత్ర మరపురానిది. దాష్టీకాన్ని ప్రదర్శించిన వారి సతీమణులు కూడా పరమోన్నతంగా పాతి వ్రత్యాన్ని ఆచరించి ధర్మ మూర్తులుగా ఎదిగిన ధర్మభూమి మనది. లంకేశ్వరుడైన రావణాసురు డి అర్ధాంగి మండోదరి నుంచి రాజాధిరాజయి న దుర్యోధనుని పట్టపురాణి భానుమతి వరకు ఎంతోమంది తమ భర్తల దుశ్చర్యలను బహిరం గంగా వ్యతిరేకించిన వారే.
మంచి చెడు అనేది కొన్ని కాలాలకు పరిమిత మైంది. ఒక కాలంలో వాళ్ళు భావించిన చెడు ఇవాళ మనకు మంచి కావచ్చు. ఇప్పుడు మనకు అనిపించిన చెడు వాళ్లకు మంచి కావచ్చు. స్త్రీ పురుషుల సమత్వం అని కొత్తగా మనం ప్రతి పాదించింది కాదు. ఏనాడో కృష్ణుడు భగవద్గీత లో ‘సమత్వం యోగ ముచ్చతే’ అన్నాడు. ఆయ న చెప్పిన సమత్వం అంటే అందరి పట్ల సమ భావం ఉన్న జ్ఞానం కావాలని. అంతేగాని సమ త్వం పేరుతో సామాజిక పరంగా మనకు మనమే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించు కోవడం కాదు. ప్రకృతి ఆడవాళ్లకు మానవుడు అంతరించకుండా ముందుకు తీసుకెళ్లే బాధ్యత నిచ్చాడు. ఈనాడు అనేక ‘టెస్ట్ట్యూ బ్ బేబీస్’ వంటి శాస్త్రీయ విధానాల వలన ఈ పేరుమీద నైనా స్త్రీ ఒక గర్భస్థ పిండాన్ని తన గర్భంలో దాల్చి తాను ఆ పిండానికి తల్లి అవ్వడం ఆమెకు మాత్రమే సాధ్యం.
స్త్రీ లేకుండా పురుషుడు, పురుషుడు లేకుండా స్త్రీ లేదు. సృష్టిని కొనసాగించేది వీరిద్దరే. అలాంటప్పుడు ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. ఎవరి పాత్ర వారు నిర్వర్తించాలి.ముఖ్యంగా స్త్రీకి తన మీద తనకు గౌరవం, నమ్మకం ఉండాలి. తను చేసే ప్రతి పని గర్వంగా, తృప్తిగా చేయాలి.
పవిత్రతకు ప్రతిరూపంగా, నిస్వార్ధానికి నిలు వుటద్దంగా, సహనమే శిరోధార్యంగా, అచంచల ఆత్మవిశ్వాసంతో జగజ్జననికి ప్రతీకగా నిలిచి జీవితంలో ఏ పాత్ర పోషించినా ఆ పాత్రకు పర మ పవిత్రత చేకూర్చగలిగే చెరగని చిరునామా అయిన స్త్రీ మూర్తిని లోకమంతా పూజనీయంగా గౌరవించాలని ఈ మహిళా దినోత్సవం సంద ర్భంగా ఒక మహిళగా ఆశిస్తూ… మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
-వేముగంటి శుక్తిమతి
99081 10937