సాంకేతికతపై సందేహాలు!
వ్యక్తులు లేదా కృత్రిమ మేధ (ఏఐ) నుంచి ఈవీఎంలకు హ్యాకింగ్ ముప్పు పొంచి ఉన్నదనే ఎలాన్ మస్క్ ప్రకటన కలకలం రేపింది. ఈవీఎంలను ఎన్నికల ప్రక్రియ నుంచి తొలగించాలని మస్క్ సూచించడం గమనార్హం.
ఈవీఎంలు సురక్షితమేనని, వాటిని వినియోగించవచ్చని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా వాటిని అనుమానాల నీలినీడలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి, అనుకున్న ఫలితాలను రాబట్టవచ్చని కొందరు నిపుణులు ప్రదర్శనలు ఇచ్చిన సందర్భాలున్నాయి. కానీ, ఆ ఆరోపణలను ఎప్పటికప్పుడు ఈసీ కొట్టిపారేస్తూ వచ్చింది. అయితే తాజాగా ఎలాన్ మస్క్ ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నిస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
వ్యక్తులు లేదా కృత్రిమ మేధ (ఏఐ) నుంచి ఈవీఎంలకు హ్యాకింగ్ ముప్పు పొంచి ఉన్నదనే ఎలాన్ మస్క్ ప్రకటన కలకలం రేపింది. ఈవీఎంలను ఎన్నికల ప్రక్రియ నుంచి తొలగించాలని మస్క్ సూచించడం గమనార్హం. అమెరికాలోని ప్యూర్టోరికో ప్రైమరీ ఎన్నికల్లో ఈవీఎంలకు సంబంధించి అక్రమాలు వెలుగులోకి వచ్చాయని అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ తన ‘ఎక్స్’ పేజీలో ఆరోపించగా.. ఆ పోస్టుపై ఎలాన్ మస్క్ స్పందించారు. మస్క్ చేసిన వ్యాఖ్యలు భారత్‌కు సంబంధించినవి కాకపోయినప్పటికీ మన దేశంలో అగ్గి రాజుకుంది. మస్క్ వ్యాఖ్యలపై మాజీ కేంద్ర ఐటీ శాఖ మంత్రి, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఇంటర్నెట్తో అనుసంధానమై ఉండే ఓటింగ్ యంత్రాలు వాడే అమెరికాకు మాత్రమే మస్క్ వ్యాఖ్యలు వర్తిస్తాయని, భారత్‌లో హ్యాకింగ్ సాధ్యపడదన్నారు. దీంతో ‘సాంకేతికంగా దేనినైనా హ్యాకింగ్ చేయడం సాధ్యమేనని, కానీ భారత్‌లో అది సాధ్యం కాదు’అని పేర్కొంటూ రాజీవ్ తప్పించుకొన్నారు.
మరోవైపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి ఇప్పటికే రెండు వారాలు గడుస్తున్నా నేటికీ రోజుకో వివాదం తెరపైకి వస్తూనే ఉన్న ది. పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లకు మధ్య భారీగా వ్యత్యాసం ఉండటం ఇప్పుడు తాజా వివాదం. ఈ మేరకు ‘ది వైర్’లో సంచలన కథనం ప్రచురితమైంది. ఆ కథనం ప్రకారం.. దేశంలోని కొన్ని సెగ్మెంట్లలో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య 2 నుంచి 3,811 ఓట్ల వరకు వ్యత్యాసం ఉండటం పలు అనుమానాలకు తావిస్తున్నది. కొన్నిచోట్ల పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లను లెక్కలోకి తీసుకోగా.. మరికొన్నిచోట్ల పోలైన ఓట్ల కంటే తక్కువగా లెక్కించడమూ అనుమానాస్పదంగా మారిం ది. లక్షద్వీప్, డామన్ డయ్యూ, అట్టింగల్ మినహా దేశంలోని అన్ని నియోజకవర్గాల్లో స్వల్పంగానైనా ఓట్ల వ్యత్యాసం ఉన్నట్టు వెల్లడికావడం ఆందోళన కలిగిస్తున్నది.
దేశంలోని అనేక నియోజకవర్గాల్లో గెలుపు, ఓటములకు మధ్య చాలా తక్కువ ఓట్ల తేడా ఉండటంతో ఈ అంశం ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్నది. ఇలా పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసం ఉండి, చాలా తక్కువ మెజారిటీతో గెలుపుతీరాలకు చేరినవారిలో అత్యధికులు ఎన్డీయే అభ్యర్థులే ఉండటం చర్చనీయాంశమవుతున్నది.
ఈ ఎన్నికలకు సంబంధించి ఈసీ వ్యవహారం కూడా మొదటినుంచీ వివాదాస్పదంగానే ఉన్నది. ఎన్నికల రోజు వెల్లడించిన ఓటింగ్ శాతానికి, ఆ తర్వాత ప్రకటించిన తుది శాతానికి అసలు పొంతనే కుదరలేదు. మొదటి విడత ముగిసిన 11 రోజులకు, రెం డో విడత పూర్తయిన నాలుగు రోజుల తర్వాత తుది ఓటింగ్ శాతాలను ప్రకటించడం పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. డిజిటల్ యుగంలోనూ తుది శాతాలను వెల్లడించేందుకు 11 రోజుల సమయం ఎందుకు పట్టిందనే ప్రశ్న కు ఈసీ సరైన వివరణ ఇవ్వలేదు. పైగా మొద టి ఐదు విడతల వరకు ఓట్ల శాతాలను మాత్రమే ఈసీ ప్రకటించింది. నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్లెన్ని? బూత్‌ల వారీగా ఎన్ని ఓట్లు పోలయ్యాయి? పురుషులు ఎంతమంది? మహిళలు ఎంతమంది? లాంటి వివరాలేవీ ప్రకటించలేదు. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శించడంతో చాలా ఆలస్యంగా పూర్తి వివరాలను ఈసీ వెల్లడించింది. మొదటి విడతకు ముందు ఏప్రిల్ 18న కేరళలోని కాసర్గోడ్లో నిర్వహించిన మాక్పోలింగ్పై కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓట్లు పడుతున్నాయని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. దీంతో పాటు పోలైన ఓట్ల కంటే ఒక ఓటు ఎక్కువగా లెక్కలోకి వచ్చినట్టు పలువురు తెలిపారు. అయితే ఈ ఆరోపణలను తోసిపుచ్చిన ఈసీ వారి అనుమానాలను నివృత్తి చేయకపోగా.. ‘ఇది ఉత్తుత్తి పోలింగే’నంటూ చేతులు దులుపుకొన్నది.
ఈవీఎలంపై ఆరోపణలు వస్తుండటంతో అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఈవీఎంల వాడకాన్ని నిషేధించాయి. వాటిని పక్కకుపెట్టేసి బ్యాలెట్ వైపు మళ్లాయి. అయితే మన దేశంలో ఈవీఎంలపై సందేహాలు, అనుమానాలు తలెత్తుతున్నప్పటికీ ఈసీ వాటిని నివృ త్తి చేయడం లేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. భారత్‌లోని ఈవీఎంలు బ్లాక్ బాక్స్లాంటివని, వాటిని పరిశీలించేందుకు ఎవరికీ అనుమతి లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ కూడా ఈవీఎంల వైపే వేలు చూపిస్తున్నది. ఈవీఎంలపై భరోసా లేనప్పుడు వాటిని వాడటం అవసరమా? అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. సాంకేతికతను వినియోగించుకోవడం మంచి దే. అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నం తవరకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, ఒక్కసారి సాంకేతికతపై సందేహం కలిగితే మా త్రం ఎన్ని అప్గ్రేడ్లు చేసినా, ఎన్ని వెర్షన్లు మార్చినా ప్రయోజనం ఉండదు.
ఎడిటోరియల్ డెస్క్
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

