శ్రీగౌతమీజనని త్య్రంబక చిద్విలాసాం
శ్రీ నాసికాపుర విలాసిత పాదపీఠాం
వ్యాసేశ్వరార్చిత మభీప్సిత సిధ్ధవాణీం
గోదావరీం శివకృపానిధి మార్యపూజ్యాం
శ్రీ రామలక్ష్మణ కుశఃస్థల తర్పితాఢ్యామ్
శ్రీ రామసాగరజలాశయ సింధురూపామ్
లక్షెట్టిపేట వరకోటి శివాంగసంగామ్
గోదావరీం శివకృపానిధిమార్యపూజ్యాం
మంత్రాఖ్యపట్టణ నిజాశ్రిత గౌతమేశాం
కాళేశముక్తిపతి నందిత సుందరాస్యామ్
శ్రీ మత్ప్రణీత వరసంగమదివ్యతీర్థామ్
గోదావరీం శివకృపానిధిమార్యపూజ్యాం
కాలేశ్వరాశ్రిత సుముక్తి పదాభిరామామ్
ఔదుంబరాశ్రిత సుధాన్విత సత్ప్రవాహామ్
లక్ష్మీపురాశ్రిత సువిస్తృత కౌతుకాఢ్యామ్
గోదావరీం శివకృపానిధిమార్యపూజ్యాం
సుందిళ్ళ శ్రీందుహరి పాదసరోజ తీర్థాం
నందీశనామ వరకల్పిత దిక్ప్రవాహామ్
గాయత్రి పార్వతి సరస్వతి సద్వసంతామ్
గోదావరీం శివకృపానిధిమార్యపూజ్యాం
ధర్మాఖ్య పట్టణనృసింహ్మమహాట్టహాసామ్
దుర్భిక్షముక్త హరకాల పరేశ సేవ్యాం
భాగీరథీ సుజల యంత్రమహా ప్రయాణాం
గోదావరీం శివకృపానిధిమార్యపూజ్యాం
కాళేశ్వర ప్రధిథ సేతువినిర్మితాస్యాం
శ్రీమత్ తెలంగ జనమోదిత హేతుభూతాం
మంత్రోక్త కార్య శుభసాధనయోగరాజ్ఞీం
గోదావరీం శివకృపానిధిమార్యపూజ్యాం
శ్రీ చంద్రశేఖర సమర్ఘ్య మహాప్రసన్నాం
శోభాయమాన కలకంఠి వరప్రసాదాం
ఆశీఃపరంపర వరస్మిత నేత్రపర్వామ్
గోదావరీం శివకృపానిధిమార్యపూజ్యాం
శ్రీ రంగనాయక విశేష సుసాగరాఖ్యాం
శ్రీ సిద్దిపేట జనభాగ్య జలోత్సవాద్యామ్
శ్రీ కూటవల్లి వరశంభు హరిద్రముద్రామ్
గోదావరీం శివకృపానిధిమార్యపూజ్యాం
మల్లన్నసాగర మహోన్నత కీర్తిరాగామ్
భక్తార్పితార్ఘ్య సుసమర్పిత చందనాఢ్యామ్
సత్యానుకూల పరివర్తిత నర్తనాఢ్యామ్
గోదావరీం శివకృపానిధిమార్యపూజ్యాం
భద్రాద్రి రామ పదసీమశుభాంతరంగామ్
సీతాసమేత వరపూత సుమంగళాఖ్యామ్
కళ్యాణ దివ్య తిలకప్రభ శోభితాడ్యామ్
గోదావరీం శివకృపానిధిమార్యపూజ్యాం
శ్రీ కల్వకుంట్ల కులపావన కీర్తిరాగామ్
శ్రీ చంద్రశేఖర పరిశ్రమదివ్యస్వప్నామ్
ఆంద్రార్థభాగ దరహాసిత సద్వసంతామ్
గోదావరీం శివకృపానిధిమార్యపూజ్యాం
గౌరీభట్ల శ్రీనాథశర్మ
99898 67211