నీళ్లు నిధులు నియామకాలు ఉద్యమసారమై
తెలంగాణ ఉదయించినపుడు,
వాగులు వంకలు చెరువులు కుంటలు
జలసిరులై సాక్షాత్కరించినపుడు,
ప్రతీ వీధి ప్రతీ పల్లె గొంతుని భగీరథ జలాలు
తడి చేస్తున్నపుడు,
పల్లెలు పట్టణాలు మౌలిక సదుపాయాల సొబగుతో
కాంతులీనుతున్నపుడు,
ప్రజావసరాలకు తగు నిధుల కేటాయింపుతో
సమాజం సంబురపడుతున్నపుడు
నెరవేరిన ఎన్నో ఏళ్ల కల
ఇపుడీ పసిడి తెలంగాణ నేల…
చదివిన చదువుకు సరైన కొలువు
యువత ఆకాంక్ష అయినపుడు,
స్థానికులకే స్థానిక కొలువు
కేవలం తీరని ఆకాంక్షయి కనిపించినపుడు
కొత్త జోనల్ వ్యవస్థకు శ్రీకారం శీఘ్ర ఆమోదం
నెరవేరిన ఎన్నో ఏళ్ల కల
ఇపుడిపుడే సాకారమై కనిపిస్తున్న శుభవేళ…
ఇపుడిదిగిదిగో – కొలువుల జాతర
నిరుద్యోగ యువత భవిష్యత్తుకు
భరోసాయై నిలుస్తున్నపుడు,
స్థానికులకే స్థానిక కొలువు
నియామకమై పిలుస్తున్నపుడు
నియామకాల ఉద్యమ
నియమం సాకారమవుతున్నపుడు
పసిడి తెలంగాణకు కొలువుల తావబ్బినట్టు…
నెరవేరిన ఎన్నో ఏళ్ల కల
పొంగిన ఆనందపు పాల వెల్లువ…
అశోక్ గుంటుక
99081 44099