కన్న ఊరు వదిలి ఆత్మీయులను వదిలి
అన్నదమ్ములను వదిలి
బాల్య స్నేహితులను వదిలి
తను నడిచిన బాటల పాదాలను మరిచి
తిన్నా తినకపోయినా కన్న ఊరిలో నీ ప్రేమలు మరిచి
అమ్మ నాన్నను వృద్ధులను మరిచి
జీవితంలో తగిలిన దెబ్బలను తలచుకుంటూ
పిడికెడు మెతుకుల కోసం
పట్నం నడిరోడ్డులో అడ్డా కూలీగా మారి
పగలనకా రేయనకా శ్రమిస్తూ
జీవితానికి ఒక ఆశయంతో ఆదర్శంతో
కూడు గూడు గుడ్డ కోసం
ఏ సంరక్షణ లేని
ఏ బీమా లేని
మనిషి అంటే ఎవరో కాదు వలస కూలి
అతడు వలస కూలి బతుకులోని బాధలన్నీ
పంటిబిగువన పట్టి
సాగిపోతున్న అతని హృదయానికి తెలుసు
పట్నంలో ఎవరు అతని కానేవారు లేరు
అతడే వలస కూలి అదే అతని
బతికే పట్నంలో కూలీనాలి
కళ్ళముందు కదలాడుతూనే ఉంది
అతని బతుకు దృశ్యం
కంటిలోని చెమ్మ
కన్నీళ్లు పెట్టిస్తుంది అతని బతుకు దృశ్యం
డాక్టర్ సీహెచ్ ఆంజనేయులు
77025 37453