మనసు పెట్టి చూసుకుందాం
మన మువ్వన్నెల జెండాను
ముదము తోడ ఎగరేద్దాం
మన మురిపాల జెండాను ॥2॥
పింగళి వెంకయ్యగారి కళాకృతి
భారత జనుల భవ్య హర్మ్యము
బహుళ ప్రాంత నాయకుల
భవ్యయోచనల సారము ॥2॥
కాషాయపు రంగు
క్రాంతికారుల స్మృతి
శ్వేత వర్ణమన్నది
శాంతికి సహకారము ॥2॥
హరిత వర్ణమన్నది
సస్యశ్యామలతకు చిహ్నము
సకలజనుల భావనలకు
సహజత్వమీ మువ్వన్నెల జెండా ॥2॥
జై జవాన్.. జై కిసాన్ ప్రతిరూపాలుగా
జన జాగృతిని కల్పించే మనజెండా
భారతజనుల భవితకై
బంగరు బాటనుచూపే మనజెండా ॥2॥
మనసు పెట్టి చూసుకుందాం
మన మువ్వన్నెల జెండాను
ముదముతోడ ఎగరేద్దాం
మన మురిపాల జెండాను ॥2॥
– సుతారపు వెంకటనారాయణ
98489 58690