ఓటు మీట నొక్కినప్పటి నుంచి
మీటర్ రన్నింగ్ అవుతూనే ఉంది
జబర్దస్త్గా ఖజానా నింపుకునుడే పనిగా
మీటర్లు పెట్టే కదా
ప్రభుత్వ సంస్థలను తోడుస్తున్నారు
ప్రైవేటు బాబులకు దొబ్బి పెడుతున్నరు
జీఎస్టీ మీటర్ అంటుపెట్టి
పాలకు పెరుగుకు పిండుతున్నరు
జీవితాలకు ఇక మిగిలింది శూన్యం
పెట్రోల్ మీటర్ పరుగు పెడ్తుంది
పర్స్ ఖాళీ చేసి ట్యాంక్ నింపుతున్నరు
చిన్నా చితక ఉద్యోగస్తులు చిట్లిపోతున్నారు
మండే మీటర్ గ్యాస్ బండ
పేదలు బతుకులు కాల్చుకుంటూ
చాలీచాలని కడుపులు నింపుకుంటున్నారు
కనిపించని మీటర్
విద్వేషాల మీటర్
అలాయి బలాయి తీసుకుంటే అడ్డొచ్చే మీటర్
ఎవరన్నారు మీటర్లు లేవని
అడుగు తీసి అడుగేస్తే మోతల మీటర్లు
పొలాలకు రావని గ్యారంటీ ఏంది..?
దాసరి మోహన్
99853 09080