ఔను నన్ను కొనుక్కోవాలి స్తోమత ఉంటే
లేకుంటే రారు నా కోసం
ఆరోగ్యం కోసం నేనవసరం
అయినా పైసా లేక నన్ను కొనరు
ఇంట్లో పాత గుడ్డలతోనే సరి!
అనారోగ్యం దరిచేరినా!!
నన్ను వాడేవారు
నా కోసం రారు
వాడనివారే వస్తారు కొనటానికి
జనం రద్దీగా ఉంటే
చివరిదాకా వేచి కొంటారు
నేనేదో కాకూడదైనట్టు
విక్రయదారుడు సైతం
అటూ ఇటూ ఓ చూపేసి
ఓ నల్లటి కవరులో చుట్టీ చేతిలో పెట్టు
నేనేదో చూడరానిదైనట్టు
జీవక్రియలో భాగం
అయినా కించిత్తు సిగ్గో భయమో..
అదే లేకపోతే సృష్టి లేదు
మానవ వికాసమూ లేదు
ఓ అమ్మాయి ధైర్యంగా నన్ను
ఉచితంగా ఇమ్మంటే
అసభ్య పదజాలం విసిరిన కౌర్
సానిటరీ నాప్కిన్ వర్సెస్ కండోమ్స్
రెంటికీ తేడా తెలియని
సివిల్ సర్వెంట్ల దేశం
విశృంఖల శృంగార కట్టడికి
కండోమ్స్ ఉచితం
జీఎస్టీ లేదూ
ఓ రక్తపు బొట్టు ఒడిసిపట్టే
ఓ నాప్కిన్పై జీఎస్టీ
కొల్లగొట్టి
మేపి దేశం దాటించే
ఏలిక చుట్టూ
నాప్కిన్ బిగుసుకుపోవాలంతే…
గిరిప్రసాద్ చెలమల్లు
94933 88201