నా తెలంగాణ పుడమి పుస్తకంలో
సింగిడి రంగులద్దుకున్న అద్భుత చిత్రం
చిత్తంబెట్టి సాధించుకున్న స్వరాష్ట్రంలో
అభివృద్ధి సప్తవర్ణాల ఉషస్సులు
హరిత వర్ణపు చీర కట్టుకున్న పల్లెలన్నీ
గీసుకున్న అద్భుత చిత్తరువు
ఇల్లిల్లు శోకాలురా తెలంగాణ..
ఇంకెపుడు తీరేనురా అంటూ
నాడు అరిగోసవడ్డ తెలంగాణలో
అద్భుత జీవన వికాసం
అంపశయ్యపైకి చేరి అశువులు
విడిచేందుకు సిద్ధమైన ఎవుసానికి
బీడు నేలను దుక్కి దున్ని
పంటసిరిగా మార్చిన కాళేశ్వరం నీళ్లు
సామాన్యుడి గోసను తీర్చ
ఎదురేగి పారిన గోదావరి మురిపెం
మిషన్ కాకతీయతో మత్తడి దుంకి
పారుతున్న చెరువులు
ఊర్లన్నీ ఊట చెలిమ్లైన వేళ
జలసిరిని చూసి రైతన్న సంబురం
అన్నదాతకు జీవగంజి వోసిన
రైతుబంధు, రైతుబీమా
రాత్రిపూట బాయికాడ
కాపుకాయాలనే రందిలేని
ఇరువై నాలుగు గంటల
కరెంట్ వెలుగు జిలుగులు
కోసిన పంటను ఆరబోసుకునేందుకు
ఊరు ఊరున కల్లాలు
పండిన పంటను కొనేందుకు
ఇంటికొచ్చిన మార్కెట్లు
బడుగు రైతు జీవన విధానాన్ని
మార్చిన సంక్షేమ పథకాలు
ఒక్కటేంది…
సారూ.. నువ్వొచ్చినాల్ల…
అభివృద్ధి ద్వారాలు తెరుచుకున్నయి
బతుకు తెర్లయిన తెలంగాణ
అభ్యున్నతి దిక్కు అడుగులేస్తున్నది.
మధుకర్ వైద్యుల
80966 77409