ఊట నీరు తీపి
తెలంగాణ భాష, యాస
తనువు పులకరించు తంగేడులా
వరి గొలుసు వర్ణం
తెలంగాణ మాగాణి మట్టి మహిమ
కడుపు నింపు దేశానికే అన్నపూర్ణమ్మ
సమశీతోష్ణస్థితి వాతావరణం
అనుకూలం అన్ని రకాల పంట సాగుకు
పసుపు, కారం, పతి,్త పట్టు రైతుకు రొక్కం
నల్ల బంగారం తల్లిగర్భంలో
తవ్విన కొద్దీ తరలి వచ్చే సంపద
కార్మికుల జీవన వెలుగులు కొండంత
మినీ ఇండియా అవతారం
ఐటీ, మల్టీమీడియా రంగాల రాక
కదిలివచ్చిరి తూర్పు పడమరల నుంచి
మతాలు మతలబులు పక్కన పెట్టి
గంగాజమున కలయికలా మనుషులు
అలాయ్ బలాయ్ సంగమ సంస్కృతి
తెలంగాణ తీర్పు స్పష్టం
మంచి చెడును వేరు చేసే హంస గుణం
మళ్ళీమళ్ళీ చరిత్ర పునరావృతం …
దాసరి మోహన్
99853 09080