రగులుతుంది రైతు గుండె
నిప్పు కణిక లాగ
పొగిలి పొగిలి ఏడుస్తుంది
పల్లె పల్లె విలవిలా
పాలకుల ప్రల్లదనానికి
రైతుగుండె విలపిస్తుంది
పచ్చని పైరులను విస్మరించి
చిచ్చుపెట్టు పాలకులకు
నిరుపేదల ఉసురు తగిలి
కొట్టుకుపోదా ఈ
అధికారుల దౌర్జన్యం
పల్లె జనం రోదనలో
అమాయకుల ఆక్రందనలు
అక్రమ కేసులతో
పేదోళ్లను చెరబట్టే
నల్లదొరల దౌర్జన్యపు
విష సంస్కృతి ఎంతకాలం?
ఇంకెంతకాలం?
-డి.సురేందర్
94413 72661