జనవరి వచ్చింది వేగంగా!
కాలాన్ని మనం ప్రశ్నించలేం కఠిన పరీక్షకు నిలబెడుతుంది ఫలితం ఎప్పుడూ ఫలహారం కాదు
కాలాన్ని మనం ప్రశ్నించలేం
కఠిన పరీక్షకు నిలబెడుతుంది
ఫలితం ఎప్పుడూ ఫలహారం కాదు
అన్ని వేళల్లో అమృతం ఒలకదు
విషాన్ని గరళంలో మోయాలి కొంత
సంతోషంగా భవిష్యత్తును పలకరించాలి
గ్రహాలు అనుకూలం అవనప్పుడు
మంచీచెడులను కావడికి తగిలించుకొని
ఓపికగా ముందుకు ప్రయాణం సాగించాలి
ఎదురు గాలి నిర్లక్ష్యంగా తోసినప్పుడు
గుండె గతిని సంతులనం చేసుకుని
సమయం కోసం సహనంగా వేచిచూడాలి
డిసెంబర్ వెక్కిరింత ఎంత సేపు
జనవరి వేగంగా వచ్చింది కదా
విజయాలు క్యూ కట్టి వస్తాయి మళ్లీ!
-దాసరి మోహన్
99853 09080
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

