అందరూ గెలవాలి
లోపాలేవో ఉండనీ
వదిలేయండి
దుఃఖాలు ఉండనీ
బాట నిండా పూలు
వెదజల్లుదాం
ఈ కలసినడిచే పయనాన్ని
సంబురం చేద్దాం
ఎవరు గెలిస్తే ఏమిటి
పెనవేసుకుందాం రండి..
అదిగో రివ్వున
సాగిపోదాము రండి
ఎన్ని నీడలు ఉండనీ
కురిసిన పున్నమి వెన్నెల్లో
రువ్విన నవ్వులే కొండంత ఊపిరి చేసుకుందాం..
రండి గోడల్ని, గడపలను దాటి
పండుగ చేసుకుందాం
కారే కన్నీటిని ఆపకండి
గుండెలను కుప్పపోసి
బతుకును గెలుద్దాం రండి
పైనుంచి పెద్దల ఆశీస్సులు
కురవనీ.. మనసులను పెద్దగా చేసుకొని
బిగ్గరగా నవ్వుకుందాం రండి
– ఆర్ద్ర, 87908 74028