KTR | వెలుగులోకి KLSR ఇన్ఫ్రా అవినీతి బాగోతం.. ఇది సీఎం రేవంత్ బినామీ కంపెనీ : కేటీఆర్
KTR | సీఎం రేవంత్ రెడ్డి హడావిడి ఎందుకు చేస్తున్నరని చెప్పి మాకు డౌటు వచ్చింది. ఆ డౌటు వచ్చిన తర్వాత మేం కూడా తవ్వడం మొదలుపెట్టాం. KLSR కంపెనీ అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చిందని.. ఇది సీఎం రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
KTR | ప్రభుత్వ అవినీతిని బయటపెడుతోంది బీఆర్ఎస్సేనని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. గత వారంపదిరోజులుగా వరుసగా మొదట హరీష్‌రావును తర్వాత నన్ను, అనంతరం రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావు, అటు తర్వాత మా అధినాయకుడు కేసీఆర్‌ను విచారణకు పిలిపిస్తే మాకు అనుమానం వచ్చింది. ఈ డైవర్షన్ గేమ్ సీరియస్‌గానే అడుతున్నరు.. ఇంతకీ ఎందుకు ఆడుతున్నరని , ఇంత హడావిడిగా ఎందుకు చేస్తున్నరని చెప్పి మాకు డౌటు వచ్చింది. ఆ డౌటు వచ్చిన తర్వాత మేం కూడా తవ్వడం మొదలుపెట్టాం. ఎందుకోసం ఈ కవర్ డ్రైవ్‌లు, ఎక్స్ట్రా కవర్ డ్రైవ్‌లు అని జాగ్రత్తగా ఆలోచిస్తే మాకు ముఖ్యమంత్రి పెద్ద బినామీ బాగోతం ఒకటి బయటపడ్డదని… KLSR ఇన్ఫ్రా కంపెనీ అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చిందన్నారు కేటీఆర్. KLSR సీఎం రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అని అన్నారు.
రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు.. ఆయన బినామీ చీఫ్ మినిస్టర్ అని అందరికీ తెలుసు. ఇప్పుడాయన బినామీ చీఫ్ మినిస్టరే కాదు బినామీ మాస్టర్ అని చూపించే బాగోతం ఇదని కేటీఆర్ అన్నారు. వాటి నుంచి డైవర్ట్ చేసేందుకే మాకు నోటీసులు ఇచ్చారని అన్నారు. రేవంత్ వాడుతున్న కారు కూడా ఈ కంపెనీ పేరు మీదే ఉంది. టీఎస్ఓ7ఎఫ్ఎఫ్ 0009. ఇది ఆయన ముఖ్యమంత్రి కాకముందు తిరిగిన కారు. ఈ కారు ఎవరిపేరుమీద రిజిస్టర్ అయిందనుకున్నారు. ఆయన తిరిగే సొంతకారు KLSR అనే ఇన్ఫ్రా కంపెనీకి. దాదాపు ఇది రెండున్నర కోట్లు విలువ చేసే కారు. లాండ్ క్రూజర్. ఆ కారును KLSR కంపెనీ ఈయనకెందుకు కొనిచ్చింది. అంటే ఐటీ వాళ్లు సమాధానం చెప్పారు. ఈయనకు సంబంధించిన భూపాల్ ఇన్ఫ్రా కంపెనీలోకి KLSR నుంచి డబ్బులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. రియల్ఎస్టేట్ డీల్ చేస్తున్నరని పేర్కొంది.
2018లోనే ఐటీ దాడులు..
రేవంత్ సీఎం కాగానే ఈ కంపెనీకి అనేక ప్రాజెక్టులు వచ్చాయన్నారు కేటీఆర్. 2018లోనే ఈ కంపెనీపై ఐటీ దాడులు జరిగాయి. 2023లోనే ఈ కంపెనీ దివాళా తీసిందన్నారు. వాళ్ల దగ్గర సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు కూడా డబ్బులు లేవు. అలాంటి కంపెనీకి రూ.6 వేల కోట్ల పనులు ఇవ్వడం ఏంటి..? అని ప్రశ్నించారు. ఈ కంపెనీకి కాంట్రాక్టులు ఎందుకు ఇచ్చారని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. ఈ కంపెనీ అవకతవకలపై దర్య్తాప్తు సంస్థలతో విచారణ చేయించాలని జనవరి 23న సుప్రీం కోర్టు ఆదేశించింది. దివాళ తీసిన కంపెనీకి రూ.6 వేల కోట్ల పనులు ఎలా ఇచ్చారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Live: తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
https://t.co/fnhTTbkocE— BRS Party (@BRSparty) February 4, 2026
Read Also :
Suryapet : ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్‌పై వేటు వేయాలి : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
BC JAC : మిర్యాలగూడలో బీసీ జేఏసీ నాయకుల ముందస్తు అరెస్ట్
Arrest : కనగల్ బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- KLSR company
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

