వైజాగ్ కాలనీ…. నల్లగొండ జిల్లాలోని దేవరకొండకు సమీపంలో ఉన్న నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్‌తో కూడిన అద్భుతమైన పర్యాటక ప్రదేశం. ఈ వైజాగ్ కాలనీకి ప్రతి శని, ఆదివారాలు ఇతర సెలవుదినాల్లో వందల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, వాటిని తమ కెమెరాలు, మొబైల్ ఫోన్లలో నిక్షిప్తం చేసుకుంటారు. అయితే, పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్న మాదిరిగానే ఇక్కడి ప్రాంతాలన్నీ ముఖ్యంగా నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ లోని సుందర ద్వీపాలన్నీ ఖాళీ మద్యం సీసాలు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులతో కాలుష్య కాసారంగా మారుతున్నాయి.
ఈనెల 8న మిత్రులతో కలిసి సరదాగా వైజాగ్ కాలనీకి వెళ్లాం. స్థానికంగా చేపల పులుసు, ఫ్రై తయారుచేయించుకొని ప్రత్యేక మరబోటులో సాగర్ బ్యాక్‌వాటర్‌లోని ఒక ఐలాండ్‌కు చేరుకు న్నాం. అప్పటికే అక్కడ ఒక ఇరవైమంది యు వకులు ఉన్నారు. వారు తెచ్చుకున్న పానీయా లు తాగి, భోజనాలు చేసి ఎంజాయ్ చేశారు. మేముకూడా తెచ్చుకున్న ఆహార పదార్థాలను తిని, మాలో కొందరు నీటిలో ఈతలు కొట్ట డం, స్నానాలు చేయడం లాంటివి ఎంజాయ్ చేశాం. సాయంత్రం 4గంటల ప్రాంతంలో తిరుగు ప్రయాణమయ్యాము.
మేము వెళ్లిన ఐలాండ్‌లో అప్పటికే పదు ల సంఖ్యలో ఖాళీ మద్యం బాటిళ్లు, ప్లాస్టిక్ సీసాలు, గ్లాసులు, ప్లేట్లు పెద్ద ఎత్తున ఉన్నా యి. అప్పటికే అక్కడవున్న ఇరవై మంది యువకులు తమతో తెచ్చుకున్న బాటిళ్లను ఖాళీ చేస్తూ వాటిని సాగర్ జలాల్లో వేయ డం, ఐలాండ్‌లో పడవేయడం కనిపించిం ది. ఆ దృశ్యం చూశాక మనం పర్యావరణా నికి ఎంత నష్టం చేస్తున్నామో అర్థమైంది. ఏంతో దూరం నుంచి అనేక వ్యయప్రయాసలతో వైజాగ్ కాలనీని సందర్శించే పర్యాటకులకు స్థానిక పంచాయతీ పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించకపోవడం శోచనీయం. దానికి తగినట్టు కనీస చర్యలు చేపట్టకపోవడం బాధకరం. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు తమ సరదాలు, సంతోషాలకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారు కానీ పర్యావరణ హిత చర్యలను ఏమాత్రం చేపట్టడం లేదు. ఈ ప్రాంతంలో ప్లాస్టిక్ వాడొద్దని గాని, ఒకవేళ వాడినా వాటిని గ్రామ పంచాయతీ వారు ఏర్పాటు చేసిన డస్ట్‌బిన్‌లోనే వేయాలని తెలిపే కనీస ప్రకటనలు ఎక్కడ కనిపించలేదు.
ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే హైదరాబాద్‌తోపాటు పలు నగరాలు, గ్రామాలకు మంచినీటిని అందించే నాగార్జున సాగర్ కొద్ది రోజుల్లోనే మరో హుస్సేన్సాగర్గా మారే ప్రమాదం ఉన్నది. ఈ ప్రమాదాన్ని నివారించేందుకు వైజాగ్ కాలనీ గ్రామ పంచాయతీ ప్రత్యేక చర్యలు చేపట్టాలి. పర్యాటకులు తీసికెళ్లిన మద్యం సీసాలు, ప్లాస్టిక్ సీసాలు, గ్లాసు లు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డస్ట్‌బిన్‌లోనే వేయాలనే కఠిన నిబంధన పెట్టాలి. అదేవిధంగా వందలాది రూపాయలు ఖర్చుచేసి అక్కడికి వస్తున్న పర్యాటకులకు నుంచి కనీసం రూ. 50 పర్యావరణ టాక్స్ వసూలు చే యాలి. ఆ మొత్తాన్ని ఐ ల్యాండ్‌లో కాలుష్య నివారణ చర్యలు చేపట్టేందుకు వెచ్చించాలి. నేరే డు గొమ్మ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే వైజాగ్ కాలనీ సంబంధిత తహసీల్దార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి సమన్వయంతో స్థానిక యువకులు, స్వచ్ఛంద సంస్థల సహాయంతో ప్రతీ రోజు ముఖ్యంగా, ప్రయాణికులు అధికంగా వచ్చే రోజుల్లో క్లీన్ అండ్ గ్రీన్‌కు ప్రాధాన్యతనివ్వాలి. అదేవిధంగా మరపడవల ద్వారా ఐల్యాండ్‌కు వెళ్లే పర్యాటకులు తాము తీసుకెళ్లే ఆహారపదార్థాలు, ఇతర బాటిళ్లను, అక్కడే పడవేయకుండా తీసుకొచ్చి డస్ట్బిన్లలో వేసేలా చైతన్య పర్చాలి. వ్యర్థాలను సాగర్ నీటి లో వేసే వారికి జరిమానాలు విధించాలి. బోటు యజమానులు కూడా ఈ విషయంలో అవగాహన కల్పించాలి. సుంద ర వైజాగ్ కాలనీని పరిరక్షించేందుకు జిల్లా పాలనా యంత్రాం గం కూడా తగు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమ లు చేయాలి.
-కన్నెకంటి వెంకట రమణ
98499 05900