తెలంగాణ ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా భక్తి శ్రద్ధలతో జరుపుకొనే పండుగ బతుకమ్మ. బతుకమ్మ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే బతుకమ్మ. పూల పాలవెల్లి ప్రజల కల్పవల్లి! ఆమె ప్రకృతి దేవత. ఆమెకు పువ్వులంటే ఇష్టం. ఎటువంటి పూలు? పచ్చని గ్రామీణ పొలాల్లో పూసే రంగురంగుల అడవి పూలు. మహిళలంతా ఆటపాటలతో బతుకమ్మను అలంకరించి, ఊరేగించి, నైవేద్యాలు అందించి, అమ్మను చెరువులో కలపడం అంటే చెట్లకూ, పూలకూ, ఆటపాటలకే కాదు. అమ్మ చెరువుకు కూడా బతుకునిస్తుంది.
నాడు గ్రామాలలో జరుపుకునే ఈ పండుగను నేడు పట్టణాలు, మహానగరాలు, ప్రపంచవ్యాప్తంగా అందరూ జరుపుకొంటున్నారు. అంటే ఆ తల్లికి గల విశిష్టత అందరికీ అర్థమవుతున్నది. బతుకమ్మ గురించిన చారిత్రక నేపథ్యం చెప్పాలి అంటే … స్త్రీ జననం ఎప్పుడో బతుకమ్మ జననం కూడా అప్పుడే! ఈ పండుగ మహిళలకు ప్రత్యేకమైనది. అంతేకాదు అత్య ంత ప్రాచీనమైనదని చెప్పుకోవచ్చును.
ప్రజల నోళ్ళల్లో తరతరాలుగా బతుకమ్మ కథ అనాశ్రుతంగా చెప్పుకొంటున్నారు. ఈనాటి వరకు బతుకమ్మ ఆటపాటలలో, కథలలో వస్తువైవిధ్యం ఉన్నది. తరతరాలుగా అతివలు అత్యంత ఉత్సాహంతో జరుపుకొనే ఈ పండుగకు ఆది ఎక్కడ? అని చారిత్రక ఆధారాలు వెతికే ప్రయత్నాలు చేస్తే అడవిలోని చెట్లు, పూలు, చెరువులు పకపక నవ్వుతాయి. ఆదిపరాశక్తి అమ్మకు ఆరంభం ఎప్పుడు? అనే మన వెదుకులాటను చూసి.
బతుకమ్మ చారిత్రక నేపథ్యానికి చక్కని ఆధారం. ప్రత్యేకమైన పూలతో పండుగ జరుపుకునే విధానం, పాడుకునే పాటలు బతుకమ్మకు ప్రత్యేకం. ఇది ఆటపాటల పండుగ. బతుకమ్మ పండుగ వర్షాలు వెలసిన తరువాత చెరువులు స్వచ్ఛమైన నీటితో సమృద్ధిగా ఉండి శరదృతువు ప్రవేశించే శుభ ఘడియలో మహాలయ అమావాస్య నుంచి ప్రారంభమై తొమ్మిది రోజులు జరుగుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో బతుకమ్మను జరుపుతారు.
ఇది ఆడవారి పండుగ మాత్రమే కాదు కుటుంబ సభ్యులందరి పండుగ. రంగురంగుల పూలతో బతుకమ్మను అలంకరించడం అనేది ఒక ప్రాచీనమైన జానపద కళ. గుమ్మ డి, తంగేడు, టేకు, కలువ, కానుగ, అల్లి, కట్లపూలతో గోపురం ఆకారంలో బతుకమ్మను తయారు చేస్తారు. చిరుధాన్యాలను ఇష్టపడే ఈ తల్లికి మక్కలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగ లు, పెసర్లు, పల్లీలు, నువ్వు లు, గోధుమలు, బియ్యం, బెల్లం, పాలతో తయారు చేసిన నైవేద్యాలను ప్రసాదంగా పెడుతారు. బతుక మ్మ పండుగ గురించి అనేకమైన ప్రాచీన కథలు పురాణాలతో మిళి తం చేసినవి పాటలుగా పాడుతారు. బతుకమ్మ అంటే తిరిగి జన్మించు’ అని అర్థం. మనకు తెలిసినంతవరకు సుమా రు 1000 సంవత్సరాల ప్రాచీనమైనది ఈ పండుగ. కాకతీయుల కాలం నుంచి ఈ పండుగ ప్రాచుర్యంలో ఉందని కొందరంటా రు. కాకతీయుల రాజ్యపాలకుడు ‘గుండన్న’ పొలం దున్నుతుండగా గుమ్మడి తోటలో దేవతా విగ్రహం లభించింది. సంస్కృతంలో గుమ్మడిని ‘కాకతి’ అంటారు. అందువలన రాజులందరూ ఆ విగ్రహాన్ని కాకతమ్మగా పూజించేవారు. తరువాత ప్రజలంద రూ కూడా ఆ విగ్రహం పాదాలవద్ద పూలకుప్పలు పోసి పూజించేవారు. విష్ణుమూర్తి చిత్రాంగదుడు అనే పేరుతో జన్మించి ఆమెను వివాహం చేసుకున్నాడని ప్రజలు నమ్ముతారు. సాధారణంగా గ్రామదేవతల కథలు అన్నీ ఒకే తీరున ఉంటాయి. కానీ బతుకమ్మ కథ అనేక విధాలుగా ప్రచారంలో ఉంది.
పాటలలో తప్ప శాసనాల లో గాని, గ్రంథాలలో గాని బతుకమ్మ గురించిన ఆధారాలు లేవు అని చరిత్రతెలుపుతున్నది. చరిత్రకారు లు బతుకమ్మ గురించి మరి న్ని పరిశోధనలు చేసి ప్రజలకు వాస్తవగాథను తెలుప వలసిన అవసరమున్నది.
-చివుకుల శ్రీలక్ష్మి