మునుగోడు ఉప ఎన్నికలలో కొందరు అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు తమ పార్టీ గుర్తును పోలి ఉండటం వల్ల ఓటర్లు తికమక పడే ప్రమాదం ఉందని టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసినా ఎన్నికల కమిషన్ (ఈసీ) స్పందించలేదు. గుర్తుల కేటాయింపులో ఈసీ కనీస ఇంగితం లేకుండా వ్యవహరించడం వల్ల ఇబ్బందులు తప్పడం లేదని పలువురు వాపోతున్నారు. అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి గాలయ్యకు ‘చెప్పు’ గుర్తును కేటాయించింది ఈసీ. అతనికి డీఎస్పీ పార్టీ (దళిత్ శక్తి ప్రొగ్రామ్) మద్దతు ప్రకటించి, చెప్పు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేస్తోంది. అయితే చెప్పు చూపించి ఓట్లు అడుగుతావా? అని అక్కడక్కడా కొందరు అపార్థం చేసుకుంటున్నారని, తప్పుగా అర్థం చేసుకోవద్దు, అది తమకు కేటాయించిన గుర్తు అని ఓటర్లను సముదాయించాల్సి వస్తున్నదట.
-వెల్జాల